బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా తనే గెలవాలి… ఫైమా సంచలన కామెంట్స్!

ఇప్పుడు ఎక్కడ విన్నా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం గురించే వినబడుతోంది. ఎందుకంటే ఈ షో చివరి దశకు చేరుకుంది. ఈపాటికే 13 వారాలను పూర్తి చేసుకొని 14వ వారంలోకి అడుగు పెట్టింది బిగ్ బాస్ సీజన్ 6. తాజాగా 13వ వారం జబర్దస్త్ కమెడియన్ ఫైమా హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఫైమా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తూ 13వ వారం వరకు కొనసాగుతూ వచ్చింది. బయటకు వచ్చిన ఫైమా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిగ్ బాస్ గురించి పలు విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడిన ఆమె తన మనసుకొని విషయాలను వెల్లడించారు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో బాగా ఎంజాయ్ చేశానని, అక్కడ లగ్జరీ లైఫ్ గడిపానని చెప్పింది. మొదటి మూడు వారాలలోని బయటకు వచ్చేస్తానేమోనని భావించిన ఫైమా ఇలా 13 వారాలు పాటు హౌస్ లో కొనసాగుతానని అసలు ఊహించలేదని చెప్పడం గమనార్హం. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లినప్పటి నుంచి తాను ఎప్పుడూ ఎక్కడ కూడా తప్పుగా ప్రవర్తించలేదని, అయితే చాలామంది నాకు కాస్త వెటకారం ఎక్కువ అని మాట్లాడడం బాధేసిందని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా యాంకర్ బిగ్ బాస్ విన్నర్ ఎవరో గెస్ చేయమని అడగా దానికి ఆమె ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చింది. ఎవరనే విషయం గురించి తనకు తెలియదు కానీ, బిగ్ బాస్ విన్నర్ మాత్రం ఆదిరెడ్డి అయితే చూడాలని ఉంది అంటూ తన మనసులోని మాటను ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చింది. కాగా ఆదిరెడ్డి గురించి అందరికీ తెలిసినదే. తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం అయిన అతను ఇపుడు బిగ్ బాస్ షో ద్వారా అందరికీ పరిచయం అయ్యారు.

Share post:

Latest