ఇష్టంలేని వ్యక్తులతో ఆ పని చేయ‌డం న‌ర‌కం.. అలా ఎన్నో సార్లు అంటూ అంజలి ఆవేద‌న‌!

తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల భామ అంజలి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఫోటో` మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అంజలి.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో సీతగా మన ఇంట్లో అమ్మాయిగా కనిపించి మురిపించింది.

ఈ సినిమా తర్వాత అంజలికి తెలుగు తమిళ భాషల్లో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. కానీ సరైన హిట్టు లేకపోవడం వల్ల ఆమె స్టార్ హోదాను అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓవైపు సినిమాలు, మ‌రోవైపు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ సత్తా చాటుతున్నాయి. ఇక‌పోతే తాజాగా అంజ‌లి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ఎంత కష్టమైనా పాత్రులు చేయడానికి అయినా తాను సిద్ధమే అని.. కానీ ఇష్టం లేని వ్యక్తులతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం అంటే నరకం లాగా అనిపిస్తుంద‌ని అంజలి పేర్కొంది. అలా ఎన్నో సార్లు చేశాన‌ని, ఇష్టంలేని వ్య‌క్తుల‌తో ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో కూడా నటించాన‌ని, ఆ త‌ర్వాత క్యారవాన్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చాన‌ని చెబుతూ అంజ‌లి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.