డేట్‌కు వెళ్దాం ర‌మ‌న్న అమ్మాయి.. అడివి శేష్ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్‌!

టాలీవుడ్ యంగ్ అండ్‌ టాలెంటెడ్ హీరో అడివి శేష్ రీసెంట్ గా `హిట్ 2` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇందులో మీనాక్షిచౌద‌రి హీరోయిన్ గా న‌టించింది. ఈ క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ డిసెంబ‌ర్ 2న విడుద‌లై హిట్ టాక్‌ను అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద సాలిడ్ క‌లెక్ష‌న్స్ తో దుమ్ములేపుతోంది. ఇక హిట్ 2 ఇచ్చిన స‌క్సెస్ తో ఫుల్ జ్యోష్ లో ఉన్న అడివి శేష్‌.. తాజాగా త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వ‌రా పంచుకున్నాడు.

ఇక సరిగ్గా అదే సమయంలో ఓ అమ్మాయి మ‌నం ఎప్పుడు డేట్‌కు వెళ్దాం అంటూ కొంటెంగా ప్ర‌శ్నించింది. అందుకు అడివి శేష్ వెంట‌నే `ఇదిగో ఇప్పుడే వ‌చ్చేస్తున్నా.. మ‌నం ఇద్ద‌రం క‌లిసి హిట్ 2 సినిమా చూద్దాం` అని దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చి స‌ద‌రు అమ్మాయిని మ‌రియు నెటిజ‌న్లను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దీంతో అడివి శేష్ ఇచ్చిన రిప్లై వైర‌ల్‌గా మారింది.

 

Share post:

Latest