టార్గెట్ మండపేట: జగన్ ఆ క్లారిటీ ఇవ్వలేదుగా..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే..కుప్పంతో సహ అన్నీ నియోజకవర్గాల్లో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్లు గెలిచినప్పుడు…175కి 175 సీట్లు ఎందుకు గెలవలమని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా మండపేట నేతలతో జగన్ సమావేశమై..మండపేటకు చాలా చేశామని, దాదాపు 946 కోట్లు ఖర్చు పెట్టమని, 90 శాతం పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని, తమ పార్టీకి ఓటు వేయని వారికి కూడా మేలు చేశామని జగన్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు మండపేట ఎందుకు గెలవలేమని అక్కడ నేతలతో అన్నారు.

మళ్ళీ యథావిధిగా కుప్పంని ఉదాహరణగా చూపించారు. అక్కడ అన్నీ గెలిచేశాం..కాబట్టి ఇంకా 175 గెలిచేస్తామని మాట్లాడారు. అయితే మండపేటలో ఈ సారి ఖచ్చితంగా గెలవడమే లక్ష్యంగా జగన్…అక్కడ వైసీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇంతవరకు మండపేటలో వైసీపీ గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా మండపేట నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు టీడీపీ నుంచి సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పటికీ ఆయనకు నెగిటివ్ పెద్దగా లేదు. కాకపోతే స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.

ఇక్కడ తోట త్రిమూర్తులు ఇంచార్జ్‌గా ఉన్నారు. ఆయన ఇంచార్జ్‌గా వచ్చిన దగ్గర నుంచి మండపేటలో వైసీపీ బలం పెరుగుతూ వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయితే జగన్ గెలవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు గాని..అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇంచార్జ్‌గా ఉన్న తోట త్రిమూర్తులుకు సీటు ఇస్తారా అనేది చెప్పలేదు. అలాగే ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ పిల్లి సుబాష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయనే వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో నెక్స్ట్ మండపేట సీటు తోటకు దక్కుతుందో లేదా..పిల్లికి ఇస్తారో క్లారిటీ లేదు. కానీ ఎవరికి సీటు ఇచ్చిన గాని..అటు వైపు టీడీపీ-జనసేన పొత్తు ఉంటే..వైసీపీకి మళ్ళీ మండపేట సీటు డౌటే.

Share post:

Latest