‘హనుమాన్’ టీజర్: అతి పెద్ద సాహసం..తెలుగు హీరో దెబ్బ చూపిన తేజ సజ్జా.. గ్రేట్ రా అబ్బాయ్..!!

వారెవ్వా.. ఇది నిజంగా .. తెలివైన తెలుగోడి హీరో దెబ్బ్ అంటూ యంగ్ హీరో తేజ సజ్జలను పొగిడేస్తున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే తేజా సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో మెప్పించాడు . చిన్నతనంలో తన నటనతో మెప్పించిన ఈ బుడ్డోడికి పెద్దయ్యాక హీరోగా అవకాశాలు వచ్చాయి. దీంతో తనదైన తనదైన రేంజ్ లో సినిమాలు చేస్తూ జనాలకు మరింత దగ్గరవుతున్నాడు . కాగా ఇప్పటికే పలు సినిమాల్లో తన మైండ్ బ్లాకింగ్ పర్ఫామెన్స్ చూపించి స్టార్ హీరోలకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్న హీరో తేజ.. త్వరలోనే హనుమాన్ అనే చిత్రంతో మనం ముందుకు రాబోతున్నాడు .

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. మల్టీ టాలెంటెడ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకుడుగా వర్క్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనున్నారు అభిమానులు. కాగా ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు . అంతేకాదు ప్రమోషన్ పనులు కూడా స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే సినిమాకు హనుమాన్ నుంచి ప్రామిసింగ్ టీజర్ ని కొద్దిసేపటి క్రితం లాంచ్ చేశారు . ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది ఈ టీజర్ . స్టార్టింగ్ లోనే ఒక పెద్ద జలపాతం వెంట వెళుతూ ..చేతిలో గదను పట్టుకొని నిలబడి ఉన్న భారీ హనుమాన్ విగ్రహాన్ని విజువల్ గా చూపించడం టీజర్ కి భారీ హైప్ ఇచ్చింది. అంతేకాదు కొండపై కొన్ని జీవులు తిరుగుతూ పరమాత్మ రాకకు సంకేతాన్ని ఇస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత సముద్రపు ఒడ్డున హీరో తేజ అపస్మారక స్థితిలో పడి ఉండి ఉండడం మనం టీజర్ లో చూడొచ్చు. భయంకరమైన సన్నివేశంలో హీరోయిన్ అమృత అయ్యార్ కనిపిస్తుంది . అంతేకాదు వరలక్ష్మి శరత్ కుమార్ ఎంట్రీ హైలెట్ గా మారింది .

అజ్ఞాతవాసిగా ఉన్న హనుమంతు సూపర్ హీరోగా ఎలా మారాడు అన్నది కథ మెయిన్ పాయింట్ అని టీజర్ క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పేసింది. మరి ముఖ్యంగా టీజర్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అంటున్నారు నెటిజన్స్ . ఏది ఏమైనా సరే ఇలాంటి సినిమాలు తీసే సాహసం మన తెలుగోడికే ఉంది అంటూ ఓ రేంజ్ లో తేజ ను పొగిడేస్తున్నారు . మొత్తానికి టీజర్ సినిమాపై హై అంచనాలను నెలకొల్పింది.

 

Share post:

Latest