కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టిపైన విరుచుకుపడుతున్న నార్త్ నెటిజన్స్.. విషయం ఇదే!

కాంతారా అనగానే మొదటగా గుర్తొచ్చేది ఆ సినిమా దర్శకుడు, నటుడు అయినటువంటి రిషబ్ శెట్టి. నిన్న మొన్నటివరకు ఎవరికీ తెలియని ఈయన కాంతారా సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పరిచయం అయ్యాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్షఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. రెండు నెలల క్రితం విడుదల అయిన ఈ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇంకా మన తెలుగులో కూడా ఈ సినిమా సుమారు 30 కోట్లు కొల్లగొట్టి కన్నడ సినిమా సత్తా చాటింది.

ఈ నేపథ్యంలో ‘కాంతార’ హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో దాదాపు అన్ని మీడియా ఛానెల్స్ ఆయన్ని ఇంటర్వూ చేసాయి. ఈ క్రమంలో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన తాజాగా ఓ నార్త్ మీడియా వేదికగా మాట్లాడుతూ… “నేను ఓ కన్నడ వాడినని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఇపుడు హిందీ సినిమాలకు సడెన్ గా మారను. నేడు ఈ స్దాయిలో ఉన్నానంటే కన్నడ పరిశ్రమ, ప్రజలే కారణం. ఓ సినిమా హిట్ అయ్యిందని నా మూలాల్ని మార్చలేను.” అంటూ రిషిబ్ ఓ ఇంటర్వూ లో చెప్పగా నార్త్ ఆడియన్స్ దాన్ని పర్సనల్ గా తీసుకున్నారు.

నార్త్ వాళ్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ… “కాంతారా హిందీలో కూడా బాగా ఆడింది. దండిగా డబ్బులు వచ్చాయి. మేము చూడబట్టేకదా మీరు పాపులర్ అయ్యారు. అలాంటిది హిందీలో సినిమాలు చేయరా? అయితే ఇంకా మీ ‘కాంతార’ సినిమా మేము చూడము… రిలీజ్ కు ముందైతే బాయ్ కాట్ ‘కాంతార’ చేసేవాళ్ళం. పెద్ద హిట్ రాగానే యాటిట్యూట్ చూపెడుతున్నాడు. అంతలా కన్నడ సినిమాని ప్రేమిస్తే హిందీలో తన సినిమాని డబ్ చేసి రిలీజ్ చేసారు? అతనికి మన డబ్బు కావాలి కానీ మన ఇండస్ట్రీని గౌరవించడు!” అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీటికి రిషబ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి మరి.

Share post:

Latest