టాలీవుడ్‌లో మరో జంట… విశ్వక్ సేన్-నివేదా పెతురాజ్ ల ఫిజికల్ కెమిస్ట్రీ కహానీ?

ఈమధ్య యంగ్ హీరో విశ్వక్ సేన్ గురించి బాగా వినబడుతోంది. చేసిన సినిమాలు ముందే అయినా మనోడు కొన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారాడు. ముఖ్యంగా ప్రముఖ న్యూస్ ప్రజెంటర్ దేవి నాగవల్లితో మనోడు Tv9 స్టూడియోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రమంలో ఈ హీరోకి బాగా మైలేజ్ వచ్చింది. ఇకపోతే విశ్వక్ సేన్ – నివేదా పెతురాజ్ జంటగా నటించిన సినిమా ధమ్కీ. ఈ సినిమా చేసినప్పటినుండి హీరో మరియు హీరోయిన్ నివేదా పెతురాజ్ మధ్య ఏదో ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే ఇంతవరకు వీరు ఇద్దరు తమ వ్యక్తిగత జీవితం గురించి ఎక్కడా ఓపెన్ అవలేదు. తాజాగా “ధంకీ” సినిమా ట్రైలర్ ఈవెంట్ కి వచ్చిన వీళ్ళని చూసి జనాలు ఆ పుకార్లు నమ్మేటట్టు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా కేవలం చాలా పద్ధతితో కూడిన పాత్రలలో మాత్రమే కనిపించిన నివేత సడన్ గా “ధంకీ” సినిమాలో అందాల ఆరబోతకు సిద్ధం అయింది. దాంతో అభిమానులు సైతం షాక్ అవుతున్నారు. ఇక సినిమా ట్రైలర్ లో విశ్వక్ మరియు నివేదా పెతురాజ్ ల మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే వీరిద్దరూ నిజ జీవితంలో కూడా ప్రేమలో ఉన్నారేమో అని సందేహం మొదలవుతుంది.

అయితే ఈ పుకార్లపై విశ్వక్ లేదా నివేదా పెతురాజ్ లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి “పాగల్” అనే సినిమాలో కూడా నటించిన సంగతి విదితమే. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి “దస్ కా ధమ్కీ” అనే సినిమాలో కలిసి నటించారు. విశ్వక్ సేన్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రెండుసార్లు కలిసి నటించడం వల్ల మాత్రమే వీరిద్దరి మధ్య ఇలాంటి పుకార్లు వస్తున్నాయా లేక వీరిద్దరి మధ్య నిజంగానే ఏమైనా నడుస్తుందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Share post:

Latest