మా ఆస్తులు పోవడానికి కారణం ఇదే.. ఆకాష్ పూరీ..!

టాలీవుడ్ డైరెక్టర్ గా డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల ఖాతాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని చేరవేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో కాస్త డిసప్పాయింట్ గా అనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ్ ఆస్తులకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ విషయాలపై ఆయన కొడుకు ఆకాష్ పూరీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

Askash Puri Reaction On Puri Jagannadh Charmy Secret Relation | ఛార్మితో  పూరి జగన్నాథ్ సీక్రెట్ రిలేషన్! భార్యకు డివోర్స్ ఇవ్వబోతున్నారా? ఆకాష్ పూరి  ఓపెన్..– News18 Telugu ...ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్ పూరీ.. ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు హీరోలను టాప్ పొజిషన్లో ఉండడానికి దర్శకుడు పూరీ జగన్నాత్ కారణమని తెలిపిన ఆకాష్.. నేను చిన్నప్పుడే డాడీకి చెప్పాను.. నీకు సినిమా మీద ఎంత పిచ్చి ఉందో నీ కంటే ఎక్కువ నాకు కూడా పిచ్చి ఉంది. మా నాన్నతో అన్నాను.. మా నాన్న పెద్ద డైరెక్టర్ అని.. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. చిరుత సినిమాతో నేను కూడా చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చాను. చిన్నప్పుడు నాన్న గురించి అర్థం కాలేదు.. కానీ నేను కూడా హీరోగా మారిన తర్వాత నాన్న గురించి బాగా అర్థమవుతోంది అంటూ చెప్పుకొచ్చారు.

ఒక సినిమా సమయంలో పూర్తిగా నమ్మి ఆస్తులన్నీ కోల్పోయాడు. ఆయన నమ్మకమే ఆస్తిని కోల్పోవడానికి కారణం అయ్యింది. ఆ తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఆ తర్వాత పూరి అంటే ఏంటో నిరూపించుకున్నారు అంటూ ఆకాష్ తెలిపారు. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారనే మాట ఎంతవరకు వాస్తవమని ఆకాష్ ని అడిగింది యాంకర్. దీంతో ఆకాష్ పూరీ స్పందిస్తూ.. అన్ని కష్టాలలో కూడా అమ్మ సపోర్టు తోనే నాన్న తిరిగి నిలదొక్కుకున్నారు. వారిద్దరిది నిజమైన ప్రేమ పెళ్లికి ముందు సినీ ఇండస్ట్రీలో ఉన్న కష్టనష్టాల గురించి తెలియజేశారు. కేవలం తన దగ్గర ₹200 మాత్రమే ఉంది రేపు ఎలా ఉంటుందో కూడా చెప్పలేను నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగితే అందుకు తన తల్లి ఓకే అని చెప్పిందని.. అంతలా ప్రేమిస్తుంది తన తండ్రిని తెలిపారు ఆకాష్.

Share post:

Latest