ఈ టాలీవుడ్ యాక్టర్స్ సినిమా కోసం చావడానికైనా రెడీ అయిపోతున్నారు!

కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాని చిన్న చూపు చూసినవారందరూ ఇపుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడి సినిమాలు ప్రపంచ వ్యాప్తమై తెలుగోడి సత్తాని నలుమూలలా వ్యాపింపజేస్తున్నాయి. దానికి ముఖ్య కారకులు దర్శక ధీరుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేవిధంగా తెలుగు హీరోలు కూడా ఇప్పుడు సినిమాలకోసం చాలా కష్టపడుతున్నారు. మంచి సినిమా చేయాలనే తపన ఈ జనరేషన్ హీరోలలో బాగా వుంది.

ఒకప్పుడు హీరో అంటే తెర మీద అందంగా కనిపించి, మూడు ఫైట్స్, మూడు పాటలు ఉంటే సరిపోతుంది అనుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు స్క్రీన్ పెజెన్స్ తో పాటుగా పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తూ నటన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పట్లో హీరోలంతా ఏదన్నా రిస్కీ షాట్స్ లో నటించాలంటే డూప్ ని పెట్టుకొని లాగేసేవారు. కానీ ఇపుడు డూప్స్ అవసరం లేకుండానే స్వయంగా యాక్షన్ స్టంట్స్ అదరగపట్టేస్తున్నారు.

అలాంటి వారిలో ముందుగా హీరో రామ్ చరణ్ ని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదట కాస్త తడబడినా…. తరువాత తరువాత మెరుగుపడి సూపర్ స్టార్ హోదాని సంపాదించుకున్నాడు. అలాగే తారక్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. సినిమా సినిమాకి ఎన్టీఆర్ తనని తాను మలుచుకుంటున్న తీరు న భూతొ న భవిష్యతి. అలాగే యంగ్ హీరో నాగశౌర్య గురించి కూడా మాట్లాడుకోవాలి. మొదట చాలా కోమలంగా కనబడిన ఈ హీరో తరువాత తరువాత ఎలాంటి రిస్కులు చేసాడో అందరికీ తెలిసిందే.

Share post:

Latest