ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు ది వ్యాక్సిన్ వార్ టైటిల్ ఎందుకు పెట్టాడో తెలుసా?

ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోలేరు. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఈయన తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది. ఇక ఈ దర్శక దిగ్గజం ప్రముఖ నిర్మాత నటి పల్లవి జోషీ కలిసి తాజాగా మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సదరు సినిమా టైటిల్ ‘ది వ్యాక్సిన్ వార్’ ని ప్రకటించారు.

అప్పటినుండి జనాల్లో క్యూరియాసిటీ మొదలయ్యింది. తాజాగా ఈయన ఈ సినిమా నేపధ్యం గురించి చెబుతూ… కరోనా వ్యాక్సిన్ కోసం ఇండియా ఎంతగా ఫైట్ చేసిందో ప్రజలకు తెలియని ఆసక్తికరమైన విషయాలను ఆ కథ ద్వారా చెప్పబోతున్నాడట. ఈ సినిమాని 2023 స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆగస్టు 15న మొత్తం 11 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. అప్పుడే రిలీజ్ డేట్ కూడా వెల్లడించారు. తాజాగా సోమవారం ఈ మూవీకి ‘ది వ్యాక్సిన్ వార్’ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో దాని వెనకున్న కహానీ ఎంటో వెల్లడిస్తూ ఓ వీడియోని విడుదల చేశారు.

అందులో ఆయన ప్రస్తావిస్తూ… ‘ది కశ్మీర్ ఫైల్స్ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా డిలే అయింది. ఆ సమయంలో టీమ్ అంతా ఆందోళనకు గురయ్యాం. అయితే ఇదే సమయంలో కోవిడ్ పై టీమ్ అంతా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. సరిగ్గా అదే సమయంలో కరోరా నుంచి భారతీయులని కాపాడేందుకు ఇండియా వ్యాక్సిన్ తయారు చేయడం మొదలు పెట్టింది. చాలా మందికి ఈ వ్యాక్సిన్ తయారు చేసింది ఎవరో కూడా తెలియదు. కానీ చాలా పెద్ద వాళ్లు ఈ వ్యాక్సిన్ ని కనిపెట్టారని ప్రచారం జరిగింది. అయితే వ్యాక్సిన్ ని కనిపెట్టింది మాత్రం చాలా సాధారణ వ్యక్తులు. వారి గురించే మా సినిమాలో చెప్పదలచుకున్నాం.’ అని చెప్పుకొచ్చారు.

Share post:

Latest