టాలీవుడ్ లో సిల్క్ స్మిత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. గతంలో ఎంతోమంది కుర్రకారులను తన అంద చెందాలతో ఆకట్టుకున్న ఈ అమ్మడు కుర్రకారులను తన వైపుకు తిప్పుకునేలా చేసింది సిల్క్ స్మిత. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా తన మత్తు కళ్ళతో ప్రతి ఒక్కరిని గ్లామర్ ట్రీట్ చేస్తు బాగా ఆకట్టుకుంది సిల్క్ స్మిత. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ఉండే కమర్షియల్ హంగులను సైతం మార్చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాంప్ పాత్రలలో తనకంటూ ప్రత్యేకమైన స్థారడం నిలుపుకుంది.
సినీ ప్రపంచంలో అమాయకపు చూపులతో చిరునవ్వులతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. గత కొన్ని సంవత్సరాలు సిల్క్ స్మిత తిరుగులేని స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. అనేక చిత్రాలలో ఐటెం సాంగ్స్ లలో నటించి తన అందాల ఆరబోత అప్పట్లో సెగలు పుట్టించేలా చేసింది ఈ అమ్మడు. కేవలం సిల్క్ స్మిత పాటల కోసమే అప్పట్లో థియేటర్లకు కూడా వెళ్లేవారు ప్రేక్షకులు. 1990లో సౌత్ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోలతో నటించింది. అయితే అలాంటి సమయంలో ఒక సీనియర్ హీరోతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం వల్ల సిల్క్ స్మిత కెరియర్ నాశనం చేసుకుంది అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
చివరికి సిల్క్ స్మిత ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంది అనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉంటాయి. సిల్క్ స్మిత తన కెరీర్లో చేసిన తప్పులలో ప్రేమ వ్యవహారాలు ఒకటైతే చిత్ర నిర్మాణ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోవడం మరొకటి అని చెప్పవచ్చు. ఇలాంటి కారణాల చేత ఈమె మధ్యానికి బానిసయి చివరికి ఆత్మహత్య చేసుకుందనే విషయాలన్నీ సీనియర్ నటి అనురాధ ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మితతో ఉన్న బంధాన్ని తెలియజేసింది.