నందమూరి తారకరత్న కెరియర్ పతనం అవ్వడానికి కారణం..?

సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగా మిగిలినవారు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. అయితే మొదటి అదృష్టం కలిసి వచ్చి ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక పోయిన వారిలో తారకరత్న కూడా ఒకరు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మొదట 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ… అటు తరువాత తారకరత్న కెరియర్ లో చెప్పుకోదగ్గ సక్సెస్ లేవని చెప్పవచ్చు.

rspnetwork.in: Taraka Ratna pics
ఇక కొన్ని సినిమాలు అయితే థియేటర్లలో ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియకుండా పోయాయి అభిమానులకు. అయితే ఆ తర్వాత మహేష్ బాబు సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపించక అవన్నీ కేవలం పుకార్లే అని తెలియజేశారు. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చివరిగా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో కనిపించారు తారకరత్న. దీంతో పర్వాలేదు అనిపించుకున్నారు తారకరత్న. అయితే తారకరత్న సినీ కెరియర్ పతనం కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని కొంతమంది సినీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.

Taraka Ratna Love At First Sight With Reshma || TFC Cinemalu - YouTube

ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. చాలా సన్నగా కనిపించేవారు. మొదటి చిత్రంతోనే తన లుక్ లో కాస్త నిరాశపరిచిన తారకరత్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెద్దగా సంపాదించుకోలేకపోయారు. మొదటి చిత్రాన్ని కోదండరామిరెడ్డి ఇలాంటి డైరెక్టర్ తో చేయగా ఆ తరువాత కొత్త దర్శకులను ఎంపిక చేసుకొని సినిమాలు చేయడం వల్ల ఇది మైనస్ గా మారింది తారకరత్నకు. ముఖ్యంగా నందమూరి కుటుంబం తారకరత్నకు సపోర్టు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడు. అలా ప్రేమ పెళ్లి వివాహం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడం వంటి వల్ల ఈ ప్రభావం తన సినీ చర్యలు మీద పడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయంగా తెలుపుతున్నారు.

Share post:

Latest