మహేష్ బాబు గొప్పతనాన్ని వివరించిన డైరెక్టర్..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి ఎంతోమంది గుండెల్లో హీరోగా నిలిచారు మహేష్ బాబు. ఇప్పటికే 1000 మందికిపైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించారు.మరొక పక్క దత్తకు తీసుకున్న రెండు గ్రామాలలోని ప్రజలకు, విద్య, వైద్యాన్ని పూర్తిగా సమకూరే విధంగా చేస్తూ ఉన్నారు మహేష్ బాబు. ఈ సేవా కార్యక్రమాలు అన్నీ కూడా నమ్రత నే స్వయంగా చూసుకుంటూ ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో ఎంతోమంది టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు కూడా సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu helps Ginna director children studiesఇటీవల మంచు విష్ణు తో జిన్నా చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ ఈషాన్ సూర్య మహేష్ చేసిన సహాయం గురించి తెలియజేయడం జరిగింది. శ్రీనువైట్ల దగ్గర ఎన్నో సినిమాలకు రైటర్ గా పనిచేశాడట.ఆ సమయంలో మహేష్ తో తనకి పరిచయం ఏర్పడిందని తెలియజేశారు. డైరెక్టర్ గా మారడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న సమయంలో తన పిల్లల చదువు కోసం చాలా ఇబ్బందులు పడ్డానని ఒకసారి వాళ్ళ చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చిందట..

Director Eeshaan Suryaah Speech At Gangster Gangaraju Movie Trailer Launch Event (Video) - Social News XYZ
దీంతో వేరే ఆప్షన్ లేక మహేష్ బాబు వద్దకు వెళ్లాడట. అప్పుడు ఇతను సహాయం అడగడానికి సంకోచిస్తుంటే మహేష్ చొరవ తీసుకొని అడిగాడట.. ఇక పూర్తి విషయం తెలిసిన మహేష్ బాబు ఈ మాత్రం దానికి ఇంత ఇబ్బంది పడుతున్నావు ఏంటి..? అని చెప్పి మేనేజర్ ని పిలిపించి ఏం కావాలో చూసుకోండి అని చెప్పారట. ఆరోజు మహేష్ బాబు అండగా నిలవకపోతే తన పిల్లలు చదువు ఆగిపోయేది అంటూ డైరెక్టర్ ఈషాన్ సూర్య తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest