ఆ స్టార్ హీరో పరిస్థితి ఘోరం.. వరుస ఫ్లాప్స్‌తో అల్లాడిపోతున్నాడు..

నటుడు సుధీర్ బాబు చాలా కాలంగా హీరో మహేష్ బాబుకి బావ అనే ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఘట్టమనేని బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’, ‘నన్ను దోచుకుందువటే’,’సమ్మోహనం’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెర వెనక మహేష్ సపోర్ట్ ఉన్నా సొంతగా అవకాశాలు అందుకునే రేంజ్‌కి ఎదిగాడు.

అంతవరకు బానే ఉంది కానీ ప్రస్తుతం సుదీర్ బాబుకి టైమ్‌ అసలు కలిసి రావడం లేదు. వరుసగా ప్లాప్స్‌ రుచి చూస్తున్నాడు. అలా అని అవకాశాలు రావడం తగ్గట్లేదు. సమ్మోహనం సినిమా తరువాత ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్‌లో ‘వి’ అనే సినిమాలో నటించాడు. సుధీర్ బాబుతో పాటు నాని కూడా నటించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చింది. కానీ మంచి కంటెంట్ లేక పెద్ద ప్లాప్ అయింది. ఓటీటీలో రిలీజ్ చేసిన కూడా ఈ సినిమాకి రెస్పాన్స్ రాలేదు.

ఇక పోయిన సంవత్సరం సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా ఊహించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇది బాక్సాఫీస్ వద్ద కుప్పకూలిపోయింది. ప్లాప్ అయినా ఈ సినిమాలో సుదీర్ బాబు నటనకు మంచి గర్తింపు వచ్చింది. ఈ హీరో తన ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీలో నటించాడు. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ అయింది. ఇలా వరుస ప్లాప్‌లను తన ఖాతాలో వేసుకుంటున్నా.. అవకాశాలు ఆ మాత్రం తగ్గడం లేదు.

రీసెంట్‌గా భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థతో ‘హంట్’ అనే యాక్షన్ మూవీలో నటించాడు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇటీవలె రిలీజ్ అయిన ‘హంట్’ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా నటుడు హర్ష వర్ధన్ డైరెక్షన్‌లో ‘ మాయ మశ్చింధ్ర ‘ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. సుధీర్ హీరోగా ఇంకో మూవీ కూడా అనౌన్స్ చేశారు. జ్ఞానశేకర్ తెరకెక్కించనున్న ఈ సినిమాకి ‘హరోం హర’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమా యాంగిల్‌లో రావొచ్చు. అయితే ఎన్ని సినిమాలు తీస్తున్నా ఒక్కటి కూడా హిట్ కాకపోవడం వల్ల ఈ స్టార్ హీరో బాగా నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest