అందుకే నేను సినిమాలు చేయడం మానేశా.. అను ఇమ్మానుయేల్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం కావొస్తోంది. ఇక తను ఏదైనా సరే స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉంటుందని చెప్పవచ్చు. కెరియర్ లో వేసే ప్రతి అడుగు కూడా మంచి స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఊర్వశివో.. రాక్షసివో అనే చిత్రంలో నటించింది ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం.

Anu Emmanuel is back to form!

ఈ సినిమాలో సింధు పాత్ర లో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిగా నటించానని తెలియజేసింది. కెరియర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి ఆమెకు ప్రేమ కావాలి కానీ ప్రేమే జీవితం అనుకోదు అలాంటి అమ్మాయికి శ్రీ కుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతారు. కెరియర్ ,ప్రేమ ,పెళ్లి ఎలా నడిచింది అన్న కథ ఈ చిత్రం అని తెలియజేసింది. ఇందులో అల్లు శిరీష్, తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ మైండ్ సెట్ తో కాంట్రాస్ట్ గా ఉంటాయని తెలియజేసింది. ఈ చిత్రానికి ఇదే హైలైట్ గా నిలుస్తుందని కూడా తెలిపింది. ప్రస్తుతం ఉన్న యూత్నీ బాగా ఈ సినిమా ఇంపాక్ట్ చేస్తుందని నమ్మకం తమకు ఉందని తెలియజేసింది.

Anu Emmanuel New Stills | Actress Anu Emmanuel | Tollywood Heroines | Photo  9 of 9
ఇక తన సినీ కెరియర్ గురించి మాట్లాడితే కెరియర్ ప్రారంభంలో నేను పవన్ ,అల్లు అర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల సరసన నటించాను. ఎవరితో యాక్ట్ చేసిన కథ బ్యానర్ గురించి ఆలోచిస్తానని అందుచేతనే నాకు అవకాశాలు రావడం లేదన్న విషయం కరెక్ట్ కాదు. కాకపోతే వరుస సినిమాలు చేయడం లేదు నేను చేసిన సినిమాలు ఆడలేదేమో కానీ నటిగా నేను ఎప్పుడూ ఫెయిల్ కాలేదని తెలియజేసింది. ఇక తన కళ్ళల్లో అభినయించగలదు అనే మార్కును సంపాదించుకున్నారని తెలియజేసింది. అయితే కొన్ని సినిమాల రిజల్ట్ చూసిన తర్వాత తనని తాను మార్చుకున్నానని తెలియజేసింది. తన పాత్రకు సెట్ అవుతేనే ఆ సినిమాలో నటిస్తానని లేకపోతే లేదని తెలియజేసింది అను. అలా ఎన్నో సినిమాలలో నటించడం మానేశానని తెలిపింది.ప్రస్తుతం అను ఇమ్మాన్యుయేల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest