అక్కడ టీడీపీని ఓడించనున్న తమ్ముళ్ళు..!

అదేంటి సొంత పార్టీ వాళ్లే టీడీపీని ఓడించడం ఏంటి అని డౌట్ రావోచ్చు…మరి ఆ డౌట్ నిజమే అని చెప్పొచ్చు..ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీలో ఉండే వర్గ పోరు వల్లే టీడీపీకి నష్టం జరిగేలా ఉంది. ముఖ్యంగా ఎస్సీ రిజర్వడ్ సీట్లలో. అక్కడ ఎస్సీ నాయకులు ఎక్కడ గెలిచేస్తారని చెప్పి..కొన్ని వర్గాల నేతలు కావాలనే ఓడిస్తారు. అలా పార్టీని కావాలని ఓడించే సీట్లలో ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు ఒకటి. పార్టీ ఆవిర్భావం అప్పుడు..ఈ సీటు టీడీపీ కంచుకోట.

1983 నుంచి 1999 వరకు వరుసపెట్టి అయిదుసార్లు టీడీపీ గెలిచింది. 2004లో ఇక్కడ తొలిసారి టీడీపీ ఓడింది. 2009లో ఈ స్థానం ఎస్సీ రిజర్వడ్‌గా మారింది. అక్కడ నుంచి ఇక్కడ టీడీపీ గెలవడం లేదు. 2009లో కాంగ్రెస్, 2012 ఉపఎన్నిక, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ గెలిచింది. కోరుముట్ల శ్రీనివాసులు వరుసగా గెలిచారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీకి ఎంత బలం ఉందో…టీడీపీకి కూడా అంతే బలం ఉంది. వైసీపీకి ధీటుగా టీడీపీ శ్రేణులు ఉన్నారు.

కానీ టీడీపీలో ఉండే కొన్ని వర్గాల నేతలు..తమ పెత్తనం కోసం కావాలని పార్టీని ఓడిస్తూ ఉంటారు. ఒకవేళ ఎస్సీ నేత గెలిస్తే..తమపై పెత్తనం చేస్తారని, తమ పెత్తనం పోతుందనే భయం అక్కడ నేతల్లో ఉంది. అందుకే కావాలని చెప్పి పార్టీని ఓడిస్తారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు పెద్ద పాజిటివ్ లేదు. వైసీపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయి. అలాంటప్పుడు టీడీపీ బలపడే ఛాన్స్ ఉంది. కానీ టీడీపీలో ఉండే వర్గ పోరు వల్ల పార్టీ బలపడటం లేదు.

టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న నరసింహాప్రసాద్..తన పరిధి వరకు పనిచేస్తున్నారు గాని..ఇతర నేతలు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నరసింహాప్రసాద్ సైతం..ఈ సీటు నుంచి మారిపోయి చిత్తూరు ఎంపీ సీటులో పోటీ చేయాలని చూస్తున్నారు. మొత్తానికైతే టీడీపీ నేతలే రైల్వే కోడూరులో టీడీపీని ఓడించేలా ఉన్నారు.

 

Share post:

Latest