అతిథి వర్సెస్ గీత: విజయనగరంలో సైకిల్‌కు చిక్కులు..!

తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుందన్న సమయంలోనే…ఆ పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు, గ్రూపు గొడవలు పార్టీకి నష్టం తెచ్చేలా ఉంటున్నాయి. రాష్ట్రంలో కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..అలాంటప్పుడు టీడీపీకి గెలవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కానీ టీడీపీలో నేతల మధ్య ఉండే విభేదాల వల్ల నష్టం జరుగుతుంది. అలా విభేదాలు నడుస్తున్న స్థానాల్లో విజయనగరం అసెంబ్లీ కూడా ఒకటి. ఇది టీడీపీ కంచుకోట. ఇంకా చెప్పాలంటే అశోక్ గజపతి రాజు అడ్డా. ఆ ఫ్యామిలీ ఇక్కడ 2004, 209 ఎన్నికల్లోనే ఓడిపోయింది.

అలా కంచుకోటగా ఉండే స్థానంలో ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతానికి అక్కడ అశోక్ తనయురాలు అతిథి ఇంచార్జ్ గా ఉన్నారు..గత ఎన్నికల్లో ఓడిపోయిన మళ్ళీ బలం పెంచుకునే దిశగా వెళుతున్నారు. ఇక అదే సీటు కోసం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా ట్రై చేస్తున్నారు. 2014లో అశోక్..విజయనగరం ఎంపీగా వెళ్ళడంతో..అసెంబ్లీలో గీత నిలబడి గెలిచారు. 2019లో ఆమెకు సీటు రాలేదు.

అయితే ఈ సారి మాత్రం సీటు దక్కించుకోవాలని గీత ట్రై చేస్తున్నారు..సెపరేట్ గా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆమె కంటూ సెపరేట్ గ్రూపు ఉంది. దీని వల్ల అతిథి వర్సెస్ గీత అన్నట్లు పోరు నడుస్తోంది. పైగా తాజాగా మంగళగిరిలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి అశోక్, అతిథి హాజరు కాలేదు..కానీ గీత మాత్రం హాజరయ్యారు. దీంతో విజయనగరంలో ఈ అంశంపై చర్చ నడుస్తోంది.

వారు కావాలని హాజరు కాలేదా? లేక ఏమైనా వ్యక్తిగత అంశాల వల్ల హాజరు కాలేదా? అనేది క్లారిటీ లేదు. కానీ సీటు విషయంలో విభేదాలు వల్లే హాజరు కాలేదనే చర్చ ఉంది. అయితే ఈ విభేదాలకు బాబు చెక్ పెట్టాలి..త్వరగా సీటు విషయం తేల్చేసి..మరొకరికి సర్ది చెప్పి, క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించరు..దీని వల్ల పార్టీకి డ్యామేజ్.