కర్నూలులో సైకిల్‌కు ఊపు..ఆ స్థానాల్లో వైసీపీకి చెక్..!

వైసీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త ఊపు కనిపిస్తోంది..ఈ మూడేళ్లలో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత కావచ్చు..ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటి అంశాలు టీడీపీకి కలిసొస్తున్నాయి. జిల్లాలో 14 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే..అయితే వాటిల్లో ఇప్పుడు కొన్ని టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి.

ఇక చంద్రబాబు పర్యటనతో మరింత ఊపు వచ్చింది. వాస్తవానికి కర్నూలులో టీడీపీకి అనుకున్నంత బలం లేదు..దీంతో బాబు పర్యటనకు పెద్ద స్పందన రాదేమో అనే పరిస్తితి..కానీ అనూహ్యంగా బాబు పర్యటనకు భారీ స్పందన వచ్చింది..ఎంత జనాలని సమీకరించినా సరే..జనాలు గంటలు గంటలు వెయిట్ చేయరు. అధికార పార్టీ అయితే ఏమన్నా పథకాలు పోతాయో, ఇబ్బందులు వస్తాయని చెప్పి జనం ఉంటారు. కానీ ప్రతిపక్ష పార్టీలకు జనాలని తరలిస్తే ఎక్కువ సేపు నిలబడటం కష్టం. బాబు పర్యటనలో మాత్రం అది కనబడలేదు. జనం భారీ ఎత్తున కనిపించారు..ఎక్కువ సేపు నిలబడ్డారు.

May be an image of 2 people, people standing, outdoors and crowd

పత్తికొండ, ఆలూరు, కోడుమూరు స్థానాల్లో భారీ స్థాయిలో జనం వచ్చారు. వీటిల్లో కోడుమూరులో టీడీపీకి ఏ మాత్రం బలం లేదు..ఇక్కడ పార్టీ గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది..మొన్నటివరకు సరైన నాయకుడు కూడా లేడు. ఈ మధ్యనే ఇంచార్జ్‌ని పెట్టారు. అయినా సరే కోడుమూరులో జనం భారీగానే వచ్చారు. అటు పత్తికొండ సీటు కే‌ఈ ఫ్యామిలీ చేతులో ఉంది. అక్కడ జనం భారీగానే వచ్చారు.

ఇక ఆలూరు సీటు కోట్ల ఫ్యామిలీ చేతులో ఉంది..ఇక్కడ ఇంకా ఎక్కువ స్థాయిలో జనం కనిపించారు. ఇలా కర్నూలులో బాబు పర్యటనకు మంచి స్పందన వచ్చింది. దీని బట్టి చూస్తే కర్నూలులో టీడీపీకి బలం పెరుగుతున్నట్లే కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ఇదే ఊపు కొనసాగితే కర్నూలులో టీడీపీకి మంచి ఫలితాలే వస్తాయి.