ఆ మూడు కోరిక‌లు తీర‌కుండానే వెళ్లిపోయిన కృష్ణ.. శోకిస్తున్న ఫ్యాన్స్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చిన ఘట్టమనేని కృష్ణ నేటి తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయి అందరినీ శోకసంద్రంలోకి నెట్టేశారు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. అయితే కొన్ని కోరికలు తీరకుండానే కృష్ణ వెళ్లిపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా శోకిస్తున్నారు.

నిండైన జీవితం గడిపిన కృష్ణకు మూడో తీరని కోరికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణకు విప్లవ వీరుడు ఛత్రపతి శివాజీగా నటించాలనే కోరిక బ‌లంగా ఉండేదట. `చంద్రహాస` సినిమాలో శివాజీగా న‌టించినా.. అది చాలా చిన్న పాత్ర‌. అందుకే అల్లూరి సీతారామరాజు తర్వాత ద‌ర్శ‌కుడు మహారధితో శివాజీ స్క్రిప్ట్ రెడీ చేయమని కృష్ణ చెప్పారట. కానీ పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. శివాజీ పాత్రలో వెండితెరపై పూర్తి స్థాయిలో క‌నిపించాలనే కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు.

అలాగే తనయులు రమేష్ బాబు, మహేష్ బాబులతో నటించిన కృష్ణ..త‌న‌ మనవళ్లతో కూడా నటించాలని కోరుకున్నారట. కానీ అది జరగలేదు. ఇక తెలుగు తెరకు గూఢచారిని పరిచయం చేసి ఆంధ్రా జేమ్స్ బాండ్ అనిపించుకున్న‌ సూపర్ స్టార్ కృష్ణ.. త‌న కుమారుడు మహేష్ బాబును జేమ్స్ బాండ్ గా చూడాలని ఆశపడ్డారట. కానీ చేతండ్రి చేసిన పాత్రలు చేయడానికి, తండ్రి సినిమాలు రీమేక్ చేయడానికి మహేష్ వ్యతిరేకం కావడంతో కృష్ణ కోరిక కోరికగానే మిగిలిపోయింది.

Share post:

Latest