సన్నీలియోన్ కొత్త కండిషన్లు.. ఆ పని చేసేటప్పుడు నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవాలట!

ప్రముఖ నటి బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన గ్లామర్‌తో పండు ముసలి నుంచి కుర్రాళ్ల వరకు అందరికీ చెమటలు పట్టిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ కొత్తగా పెట్టిన కండిషన్లు తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఇటీవలే సన్నీలియోన్ తనతో సినిమా, ఐటమ్ సాంగ్స్ చేసేవారికి కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే తనని సంప్రదించమని, లేకపోతే తన వద్దకు రావొద్దని చెప్తోంది. మరి ఈ రొమాంటిక్ బ్యూటీ పెట్టిన ఆ కండిషన్స్ ఏంటీ?

సన్నీలియోన్ సినిమాలో నటించాలనుకునే వారు షూటింగ్ లొకేషన్‌లో కరోనా నిబంధనలు తప్పక పాటించాలి. అంతేకాకుండా ఆమెతో పాటు వచ్చే వాళ్లకి కూడా తగిన మర్యాదలు చేయాలి. అలాగే తానొక పోర్న్ స్టార్ అని చులకనగా, తక్కువగా చూడకూడదట. మిగతా వారిలాగానే తనను కూడా ట్రీట్ చేయాలట. ఇకపోతే ఇంకో మెయిన్ కండిషన్ ఏంటంటే ‘తను ఐటమ్ సాంగ్స్ వంటివి చేసే సమయంలో అక్కడ చిన్న పిల్లలు ఉండకూడదు. అలానే ఇతర డాన్సర్స్‌కి కూడా సన్నీలియోన్ కి ఇచ్చే గౌరవం ఇవ్వాలి అని కండిషన్స్ పెట్టింది.

సన్నీలియోన్ పెట్టిన కండిషన్స్ న్యాయంగానే ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఒక తమిళ దర్శకుడు ఐటమ్ సాంగ్ కోసం సన్నీని కాంటాక్ట్ అవగా ఆమె కండిషన్స్ బయటపడ్డాయి. ఆ కండిషన్స్‌కి దర్శకుడు ఒప్పుకోవడంతో ఆమె డేట్స్ ఇచ్చిందని కోలీవుడ్ మీడియాలో టాక్. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తన సరికొత్త ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల గుండెల్లో గిలిగింతలు పెడుతోంది.

Share post:

Latest