థర్డ్ స్టేజ్ లో మయోసైటిస్..మరింత క్షీణించిన సమంత ఆరోగ్యం..నెక్స్ట్ స్టేజ్ ఎంత డేంజర్ అంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించే సత్తా ఉన్న ముద్దుగుమ్మ . అటు క్లాసిక్ రోల్స్.. ఇటు మోడ్రన్ రోల్స్ ..ఎలాంటి క్యారెక్టర్ లోనైనా సరే పరకాయ ప్రవేశం చేసి నటించి.. హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హాట్ బ్యూటీ . కాగా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతున్న సమంత.. రీసెంట్ గానే తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పకు వచ్చింది .

దీంతో ఒక్కసారిగా సమంత ని అసహ్యించుకునే జనాలు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని పూర్తి ఆరోగ్యవంతురాలుగా మళ్లీ మునిపటిలా సినిమాలు చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత మయోసైటీస్ వ్యాధి మరింత ముదిరిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా యశోద సినిమాలో సమంతతో పాటు నటించిన నటి కల్పిక సమంత ఆరోగ్యం పై సంచలన కామెంట్స్ చేసింది .సమంత లాగే నాకు ఓ అరుదైన వ్యాధి ఉందని..గత 13 ఏళ్లుగా స్పాండిలైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నానని.. నాకు ఈ వ్యాధి ఫస్ట్ స్టేజ్ లో ఉందని.. సమంతకు మయోసైటిస్ ధర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పుకొచ్చింది.

అంతేకాదు ప్రస్తుతం సమంత చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. విపరీతమైన కండరాల నొప్పితో ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు సమంత వ్యాధి మరింత ముదిరిపోతే .. సమంత నాలుగో స్టేజ్ లోకి ఎంటర్ అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ..సమంత లేచి నిలిచుకునే పొజిషన్ కూడా ఉండదని డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సరే సమంత తన ఆరోగ్యం పై కాన్సెంట్రేషన్ చేసి కొన్నాళ్ళు సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి ఆరోగ్యంగా ఉన్న తర్వాతే ఆమె ఇండస్ట్రీపై కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందంటున్నారు. మరి చూడాలి సమంత ఏం చేస్తుందో..?

Share post:

Latest