శ్రీలీల వయసు మాత్రం చిన్నది.. మనసు మాత్రం పెద్దది.. చాలా గ్రేట్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శ్రీలీల. మొదట డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన మొదటి చిత్రంతో ఎంతోమంది కుర్రకారులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కన్నడలో కూడా ఒకటి, రెండు సినిమాలలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ టాలీవుడ్ లో బాగానే పేరు సంపాదించింది ఈ ముందుగుమ్మ. ఇక తర్వాత రవితేజ సరసర నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే నటన పరంగానే కాకుండా శ్రీలీలా ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ కూడా చదువుతోంది.

Pelli SandaD Heroine Sree Leela images, Age, Wiki, Biography, Instagram,  Movies, Photos, and Family.

ఈమె యాక్టర్ తో పాటు డాక్టర్ కావాలనే కోరిక తనలో చాలా బలంగా ఉన్నందువల్లే తన చదువును కూడా ఆపేయకుండా పూర్తిచేస్తుందట ఈ ముద్దుగుమ్మ. ఇక తన తల్లిని ఆదర్శంగా తీసుకొని బెంగళూరులో తన చదువును పూర్తి చేస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఇంత చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఇద్దరు చిన్నపిల్లలని దత్తకు తీసుకొని పెంచుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాళ్లు మామూలు పిల్లలు కాదు అంగవైకల్యంతో కూడిన పిల్లలు కావడంతో శ్రీ లీల అభిమానులు సైతం ఈమెను మెచ్చుకుంటూ ఉన్నారు.

Sreeleela : ఇంత చిన్న వయసులో ఎంతపెద్ద మనసు ..నువ్వు గ్రేట్ శ్రీలీల -  Sreeleela Adopts Two Differently-abled Kids,Sreeleela,Pelli  Sandadi,Dhamaka,Raviteja,Adoption,Sreeleela Movies,Sreeleela Personal Life  ...సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతోందంటూ వార్తలు వినిపిస్తున్నప్పటికీ అలా పెంచిన డబ్బులను ఇలా ఉపయోగిస్తుంది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక చిన్న వయసు నుండి తండ్రి లేక పెరిగింది కాబట్టి కుటుంబ విలువలు శ్రీ లీలాకు బాగా తెలుసు అని అందుచేతను ఇంత చిన్న వయసులోనే ఇలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది అంటూ పలువురు ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Share post:

Latest