మరోసారి తన గొప్ప మనసు చాటుతూ.. రియల్ హీరో అనిపించుకుంటున్న బన్నీ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన సేవాగుణంలో కూడా ముందుంటానని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం కాని రాష్ట్రంలో ఒక పేద విద్యార్థినిని చదివించడానికి ముందుకు వచ్చి అక్కడి ప్రజల మన్ననలను కూడా అందుకుంటున్నారు అల్లు అర్జున్. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే.. కేరళలోని అలెప్పీ లో ఒక నర్సింగ్ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానంటూ జిల్లా కలెక్టర్ మైలవరపు కృష్ణ తేజకు హామీ ఇచ్చారు…

We are for Aleppey ప్రాజెక్టులో భాగంగా అల్లు అర్జున్ ఈ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. 2018లో వచ్చిన కేరళ బీకర వరదల సమయంలో లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రత్యేకించి పున్నమనాడ బ్యాక్ వాటర్స్ లో ఉండే అలెప్పీ ప్రాంతం వరదలు ధాటికి పూర్తిస్థాయిలో నష్టపోయింది. దీంతో అప్పటికే” ఆపరేషన్ కుట్టినాడు ” ద్వారా లక్షలాదిమందిని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అప్పటి అలెప్పి సబ్ కలెక్టర్ ప్రస్తుత జిల్లా కలెక్టర్ మైలవరపు కృష్ణ తేజ “ఐ యాం ఫర్ అలెప్పి” కార్యక్రమాన్ని ప్రారంభించారు.

പ്ലസ്ടുവിന് 92%, തുടർപഠനത്തിന് വഴിയില്ല; കളക്ടർ വിളിച്ചു, മലയാളി  വിദ്യാർഥിനിയുടെ പഠനച്ചെലവ് എറ്റെടുത്ത് അല്ലു അർജുൻ | Allu Arjun took the  student's ...ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.. వరద సహాయం నుంచి పునరావాసం , ఉపాధి కల్పన , ఇళ్ళ నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించడం.. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, యాంకర్ సుమ, రాజమౌళి బాహుబలి బృందం ఇలా అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తమ వంతు సహాయం అందించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు “We are for Aleppey ” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్గా కృష్ణ తేజ చేపట్టారు. అందులో భాగంగానే కోవిడ్ కల్లోలంలో తండ్రిని కోల్పోయిన ఒక పేద విద్యార్థినికి నర్సింగ్ చదువు నిమిత్తం ఆర్థిక సహాయం కావాల్సి ఉంది.

అయితే ఈ విద్యార్థినికి నాలుగేళ్ల చదువుకు అవసరమయ్యే 10 లక్షల రూపాయలను ఇస్తానని ఆమె చదువు పూర్తయ్యే వరకు ఆమెను దత్తత తీసుకుంటానని రియల్ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు. ఈ విషయాన్ని అలెప్పీ కలెక్టర్ కృష్ణ తేజ తన ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కట్టానంలోని సెయింట్ థామస్ నర్సింగ్ కాలేజ్ లో ఈమెకు మేనేజ్మెంట్ కోటా కింద సీటు దక్కింది. అల్లు అర్జున్ ఇచ్చిన హామీపై కళాశాల ప్రతినిధులతో పాటు కలెక్టర్ కూడా చర్చించారు. ఆ విద్యార్థిని ఇక ఏ భయం లేకుండా చదువుకుంటుంది.. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది … భవిష్యత్తులో తన తల్లిని, సోదరుడిని బాగా చూసుకోగలరని చెబుతూ సహాయం అందించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కృతజ్ఞతలు అంటూ తెలిపారు జిల్లా కలెక్టర్ కృష్ణ తేజ.

https://www.facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.facebook.com%2Fdistrictcollectoralappuzha%2Fposts%2F681143906702862&display=popup&ref=plugin&src=post