షాక్ కొట్టేలా ఉన్న అవతార్-2 టికెట్ ధరలు..!!

ఎపిక్ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫిలిం అవతార్ దీ వే అఫ్ వాటర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేక్షకుల సైతం ఎదురుచూస్తున్నారు. 2009లో వచ్చిన అవతార్ సినిమా కొనసాగింపు గా వస్తున్న అవతార్-2 సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి డిసెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం భారతీయులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కూడా భారీగానే ఓపెనింగ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టికెట్ల రేట్ల విషయం సోషల్ మీడియాలో పలు చర్చలకు దారితీస్తోంది.

Avatar 2: Makers Quoting A Shocking Price For Theatrical Rights In Telugu States, Distributors In Confusion?

ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని థియేటర్లలో అత్యధికంగా రూ.1450 రూపాయలు ఒక్కో టికెట్ అమ్ముతూ ఉండడంతో అందరిని ఆచార్యాన్ని కలిగిస్తోంది.ఒక విధంగా ఈ సినిమా రేంజ్ కు తగ్గట్టుగా ఇంత రేట్లు పెట్టిన అది తక్కువనే కొనుక్కునేవారు చాలామంది ఉంటారు. కానీ ఈ రేంజ్ లో సినిమా టికెట్లు రేట్లు ఉంటే మధ్యతరగతి ప్రేక్షకులు సైతం కుటుంబ ఫ్యామిలీతో ఇలాంటి సినిమాలుకు వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధికంగా ఇండియాలో బెంగళూరులోని ఐమాక్స్ 3d ఫార్మాట్లో ఒక్కో టికెట్ ధర రూ.1450 రూపాయలుగా ఫిక్స్ చేశారు ఇక పూణేలో కూడా రూ.1200 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఢిల్లీ కోల్కత్తా వంటి పలు నగరాలలో మాత్రం ఈ సినిమా టికెట్ ధర రూ.750 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మధ్యలో ఉన్నట్లు సమాచారం టెక్నాలజీకి తగ్గట్టుగాని ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు సినిమా టికెట్ల ధరలను ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైజాగ్ లో మాత్రం 3d ఫార్మాట్లో అయితే రూ.210 రూపాయలు ఒక టికెట్ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా అవతార్-2 సినిమా రూ.1600 వందల కోట్ల రూపాయల బడ్జెట్ తెరకెక్కించారు మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.