మహానటి సావిత్రి, నందమూరి తారకరామారావుతో సినిమా చేయనని మొండికేసిందట?

అలనాటి మహానటి సావిత్రి, నట విశ్వరూప నందమూరి తారకరామారావు గురించి పరిచయం చేయనవసరం లేదు. అప్పట్లో సౌత్ ఇండియాలోనే బెస్ట్ కాంబినేషన్ వీరిది. ఈ క్రమంలో వారు అనేక సినిమాలలో జంటగా నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఇద్దరికంటూ చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది అప్పట్లో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి వసూళ్ళని రాబట్టేది అప్పట్లో. అయితే ఎన్నో సంవత్సరాల పాటు అనేక సినిమాలలో నటించిన ఈ జంట పై అప్పట్లో ఏదో ఒక రూమర్స్ నడిచేవి. మొదటిసారి ఎన్టీఆర్ , సావిత్రి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల.

పాతాళ భైరవి సినిమా నుండి వీరు కలిసి నటించారు. ఈ చిత్రం 1950లో విడుదల అయింది. ఈ సినిమా తర్వాత వచ్చిన మిస్సమ్మ సినిమా ఈ జంటకు మరింత పేరు తీసుకొచ్చిందని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో ఒకసారి ఎన్టీఆర్ తో నటించను అంటూ తేల్చి చెప్పేసిందట మహానటి సావిత్రి. వివరాల్లోకి వెళ్తే 1965 NTR హీరోగా సత్యహరిశ్చంద్ర సినిమా తీయాలని విజయ సంస్థ అనుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎప్పటిలాగానే సావిత్రికి ఇవ్వాలని అనుకున్నారట. కానీ ఆమే దానికి నో చెప్పిందట.

అప్పటికే వీరి కలయికలో అనేక సినిమాలు వచ్చి సూపర్ హిట్టయ్యాయి. దాంతో మంచితో పాటు కాస్త చెడు కూడా వీరికి ఎదురైందట. దాంతో సావిత్రి మైండ్ పూర్తిగా మార్చుకుందట. అలాగే విజయ సంస్థతో కొన్ని వివాదాలు ఉండడంతో సావిత్రిని ఆ సినిమా నుంచి తప్పించాలని కొంతమంది అనుకున్నారట. ఇంకా కొన్ని కారణాల నడుమ అమె సినిమా చేయనని తెగేసి చెప్పిందట. ఇక అక్కడినుండి వీరిమధ్య సినిమాలు తగ్గిపోతూ వచ్చాయి. ఎవరి సినిమా జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. ఇక ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు, రాజకీయం అంటూ బిజీ అయిపోయాడట.

Share post:

Latest