జగన్‌ని ఇరుకున పెడుతున్న సీనియర్లు.!

నెక్స్ట్ ఎన్నికల్లో ఏ ఒక్క వారసుడుకు కూడా సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడు ఉన్నవారే మళ్ళీ తనతో కలిసి పోటీ చేయాలని చెప్పి..ఆ మధ్య గడపగడపకు వర్క్ షాపులో జగన్…ఎమ్మెల్యేలకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గడపగడపకు కొందరు ఎమ్మెల్యేలు తమ వారసులని తిప్పుతున్నారు. దీనిపై జగన్ సీరియస్ అయ్యారు..ఎమ్మెల్యేలే గడపగడపకు వెళ్లాలని, వారసులు వెళితే కౌంట్ చేయమని చెప్పేశారు ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన వారసుడు పేర్ని కృష్ణమూర్తి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు.

మీ వారసుడుకే కాదు..ఏ వారసుడుకు కూడా సీటు ఇవ్వనని జగన్ తేల్చి చెప్పేశారు..మీరే నాతో కలిసి పోటీ చేయాలని చెప్పేశారు. దీంతో సీనియర్ ఎమ్మెల్యేల వారసుల ఆశలకు గండి పడినట్లైంది. అయినా సరే కొందరు వారసులు ఇప్పటికీ గడపగడపకు తిరుగుతున్నారు. ఖచ్చితంగా తమ వారసులకు సీటు ఇప్పించుకోవాలనే ఉద్దేశంతోనే..సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఇప్పటికే పేర్ని ఫిక్స్ అయిపోయారు..ఎట్టి పరిస్తితుల్లోనూ తన వారసుడునే రంగంలోకి దించాలని..అందుకే మచిలీపట్నంలో పేర్ని కిట్టు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగానే ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా సైతం..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన వారసురాలు పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సైతం ఇంకా నెక్స్ట్ తాను పోటీ చేయలేనని చెప్పేశారు. ఈ విషయం జగన్‌కు కూడా చెప్పానని, ఇప్పుడు తన వయౌసు 83 అని, జనంలో తిరగలేనని, గుండె సమస్య ఉందని, ఎక్కువసేపు మాట్లాడలేనని చెప్పేశారు.

ఇక సీఎం సైతం తన వారసుడు పోటీపై సర్వే చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంటే వారసులకు తప్పనిసరిగా సీటు ఇవ్వాల్సిన పరిస్తితి జగన్‌కు వచ్చేలా చేశారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఎంతమంది సీనియర్ ఎమ్మెల్యేల వారసులు రంగంలోకి దిగుతారో చూడాలి.