తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరంటూ బాంబు పేల్చిన సీనియర్ నటి..!!

గతంలో ఎన్నో సినిమాలలో అమ్మ, అక్క, చెల్లి, వదిన పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి ప్రభ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే నటి ప్రభా గతంలో ప్రముఖ సీనియర్ నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తో పాటూ ఇతర తమిళ నటులతో హీరోయిన్గా నటించింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకోవడంతో కుటుంబ బాధ్యతలు పెరగడంతో కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అటు తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఉన్నది.

Prabha: చిత్రం… భళారే విచిత్రం… ప్రభ అభినయం! - NTV Teluguగడిచిన కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు హీరోయిన్గా నటించిన తర్వాత కుటుంబ బాధ్యతలు పెరగడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలిపింది. అంతేకాకుండా తన భర్తతో విదేశాలలో కూడా సెటిల్ కావడంతో మళ్లీ నటించే అవకాశం రాలేదని చెప్పుకొచ్చింది. తాను కూడా ఒక మంచి క్లాసికల్ డాన్సర్ అని ఎన్నోచోట్ల పలు ప్రదర్శనలు కూడా చేశానని తెలియజేసింది ప్రభ.

Prabha - IMDbబాలకృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలు సరసన నటించే అవకాశాలు చాలా కోల్పోయానని తెలిపింది. తన కొడుకు ప్రస్తుతం విదేశాలలో ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉన్నారని, అలాగే తాను కూడా పలు సినిమాలలో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించానని తెలిపింది. ఈమధ్య ఎక్కువగా నిర్మాతలు బొంబాయి నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో లోకల్ గా ఉన్నటువంటి ఆర్టిస్టులకు అవకాశాలు చాలానే తగ్గిపోయాయని తన అభిప్రాయంగా తెలియజేసింది ప్రభ. ఇండస్ట్రీలో ఎంతోమంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. వారిని కాకుండా ఇతర భాషల పరిశ్రమల నుంచి నటులను తెచ్చుకోవడం దురదృష్టమని తెలియజేసింది. ప్రస్తుతం ప్రభ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest