సమంత యశోద వరల్డ్ వైడ్ బిజినెస్ డీటెయిల్స్ ఇవే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారిగా పాన్ ఇండియా లెవల్లో నటించిన సినిమా యశోద. ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని నిర్మాతలు భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్లతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి బజ్ క్రియేట్ చేయగలిగారు. సమంత ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొని.. సినిమాపై హైప్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఇప్పుడు సమంత యశోద సినిమాకి ఓల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు చూద్దాం.

Samantha's new-age action thriller 'Yashoda' to release on THIS date |  Details | Regional-cinema News – India TV

యశోద వరల్డ్ వైడ్ సాధించిన బిజినెస్
నైజాం – 4.50 కోట్లు,
సీడెడ్ – 1.50 కోట్లు
ఆంధ్ర – 5.50 కోట్లు
మొత్తం ఆంధ్ర, తెలంగాణ- 11.50 కోట్లు
కర్ణాటక – 1.50 కోట్లు
తమిళనాడు – 4 కోట్లు
హిందీ – 2 కోట్లు
ఒరిస్సా – 2.50 కోట్లు
మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ – 21.50 కోట్లు..

Samantha Yashoda Movie World wide pre release business detail

సమంత విడాకులు తర్వాత తొలిసారిగా పాన్ ఇండియా లెవల్లో నటించిన సినిమా కావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. తెలుగులో ఈ సినిమాకు రూ.15.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా హిట్ సినిమాగా నిలవాలంటే రూ. 22.50 కోట్ల కలెక్షన్లను అందుకోవాలి. ఇంత భారీ కలెక్షన్లను అందుకోవటం సమంతకి పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు. సినిమాపై పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాకు మూడింతల కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమాను సరోగసి నేపథ్యంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Share post:

Latest