సమంత నెక్స్ట్ సినిమాకి ఆ హీరో డైరెక్షన్.. ఊహించని కాంబో ఇది?

టాలీవుడ్ అగ్రతార సమంత నటించిన తెలుగు సినిమా యశోద నాలుగు రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నిజానికి సమంతకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మామూలుగా సమంతకి చిన్నయి డబ్బింగ్ చెప్తుంది. అయితే కొంతకాలంగా చిన్మయి డబ్బింగ్ అవసరం లేకుండానే సమంత సొంత డబ్బింగ్‌తో అన్ని సినిమాలు కానిచేస్తోంది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగో లేకపోయినా కూడా ఆమె సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పింది.

సో, చిన్మయి – సమంత మధ్య అసలు కొంచెం కూడా మాటలు లేవని తెలుస్తోంది. అయితే, చిన్మయి భర్త, నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ యశోద చిత్రాన్ని సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. సమంత సినిమాని ప్రమోట్‌ చేయడానికి రాహుల్ కి ఏంటి అవసరం? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని వెనుక ఒక పెద్ద స్టోరీ ఉన్నట్లు సినీ సర్కిల్లో ఓ ప్రచారం జరుగుతోంది.

యూ టర్న్‌కి ముందు సమంత, రాహుల్ కలిసి “మాస్కోవిన్ కావేరి”లో హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సమయంలో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ ఫ్రెండ్‌షిప్ ఇప్పటికీ చక్కగానే కొనసాగుతోంది. అయితే ఆ సన్నిహిత్యంతోనే అతడు సమంత వద్దకు వెళ్లి ఒక కథ వినిపించాడని.. ఆ కథతో సినిమా చేసేందుకు సమంత కూడా ఒప్పుకుందని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ సమంతని ప్రధాన పాత్రలో చూపిస్తూ ఒక ఫిమేల్‌ సెంట్రిక్ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఒక పుకారు షికారు చేస్తోంది. నిజానికి సమంత కంటే ముందు అతను రష్మికకు కథ వినిపించాడు, కానీ కన్నడ బ్యూటీ దానిని ఓకే చేయలేదు. ఇదే కథను విన్న సమంత చాలా ఎగ్జైట్ అయ్యిందని, ఈ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.

ఒకవేళ ఈ పుకారు నిజమే అయితే.. ఈ హీరో దర్శకత్వంలో సమంత నెక్స్ట్ సినిమా ఖాయమవుతుంది. విజయ్ దేవరకొండతో ‘ఖుషి’… వరుణ్ ధావన్‌తో వెబ్ సిరీస్‌తో సహా తన ప్రస్తుత కమిట్‌మెంట్లను పూర్తి చేసిన తర్వాత, ఆమె రాహుల్ చిత్రం ప్రారంభం కావచ్చు. ఈ సినిమా గురించి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ అతడు ఆమె ఫిలిం ని ప్రమోట్ చేస్తుండడం అలానే సినీ వర్గాల్లో మీరు కాంబోలో ఒక మూవీ వస్తుందని వార్తలు వినపడటం చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తున్నట్లు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Share post:

Latest