బాలయ్య కొడుకుతో రోజా కూతురు.. క్లారిటి వచ్చేసిందోచ్చ్..!!

సినీ ఇండస్ట్రీలో రోజా గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి తమిళ , తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసింది. ఈమె ప్రజెంట్ రాజకీయాల్లో చక్రం తిప్పు తుంది . కాగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా తన బాధ్యతలను ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు . ఈ క్రమంలోనే రోజా తన జన్మదిన సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు .

అంతేకాదు మంత్రి రోజాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ,స్నేహితులు , జబర్దస్త్ కమెడీయన్స్, ప్రముఖ సింగర్ మంగ్లీ ఆమె సోదరీ ఇంద్రావతి చౌహన్ కూడా కలిసి శ్రీవారిని దర్శించుకుని.. అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చారు . కాగా ఆ తర్వాత ఆలయం బయట మంత్రి రోజా మీడియాతో ముచ్చటించారు . ఈ క్రమంలోనే మత్రిగా బాధ్యతలూ చేపట్టిన తర్వాత మొదటిసారిగా పుట్టినరోజు జరుపుకుంటున్నానని ..అందుకే స్వామి ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పారు.

కాగా ఇలాంటి టైంలోనే ఆమెకు తన కూతురు అన్షు మాలిక హీరోయిన్గా త్వరలోనే స్టార్ హీరో కొడుకుతో ఎంట్రీ ఇవ్వబోతుంది నిజమేనా..? అన్న ప్రశ్న ఎదురైంది . దీనికి రోజా తనదైన స్టైల్ లో సమాధానం చెబుతూ ..”ప్రజెంట్ నా కూతురు అన్షూ మాలిక స్టడీస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది . అంతేకాదు ఆమెకి సినిమాలో వచ్చే ఇంట్రెస్ట్ లేదు . వస్తానంటే నేను వద్దన్నాను . నా కూతురికే కాదు నా కొడుకు కూడా అదే చెప్తాను . ఇండస్ట్రీలోకి వస్తాను నటిస్తాను అంటే నేను ఏనాడు నో చెప్పను ..వాళ్ళకి నచ్చిన పని చేసుకునే పూర్తి స్వేచ్చని ఇస్తాను.. కానీ అన్షు మాలిక సైంటిస్ట్ అవ్వాలనుకుంటుంది.. దాని ప్రకారం చదవాలని అనుకుంటుంది..

అంతే తప్పిస్తే అప్పుడే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావాలని నా కూతురికి లేదు “అంటూ బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో అన్షు మాలిక తన సినీ కెరీయర్ ని ప్రారంభిస్తుందన్న వార్తలకు పరోక్షంగా చెక్ పెట్టింది. ఏది ఏమైనా సరే ఒక్క మాటలో రోజా తన కూతురు సినీ భవిష్యత్తుకి సంబంధించిన ఫిల్మీ అప్డేట్స్ పై వార్తలు రాకుండా చంప చల్లుమనిపించే ఆన్సర్ ఇచ్చింది అంటున్నారు ఆమె ఫ్యాన్స్..!!

Share post:

Latest