పుట్టపర్తి సాయిబాబాకి, NTRకి వున్న సంబంధం ఏమిటి? ఎందుకలా జరిగింది?

పుట్టపర్తి సాయిబాబా గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా అతని భక్తులు వున్నారు. సత్యసాయి బాబా 1926 నవంబరు 23న పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకి ఓ నిరుపేద వ్యవసాయ భట్టు రాజుల కుటుంబంలో జన్మించాడు. అనంతపురం జిల్లాలోని, పుట్టపర్తి అనే కుగ్రామం వారి నివాసం. సత్యనారాయణ వ్రతం తరువాత పుట్టిన సంతానం కనుక అతనికి సత్యనారాయణ రాజుగా పేరు పెట్టగా తరువాతి కాలంలో సత్యసాయిబాబాగా పేరు గాంచాడు. 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు ఈయన.

ఈయన పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయి అని స్థానికులు చెబుతారు. సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించేవారి సంఖ్య 60 లక్షలు ఉంటుందని ఓ సర్వే. అయితే కొందరు భక్తులు మాత్రం ఈ సంఖ్యను “5 నుండి 10 కోట్ల మధ్య” అని చెప్పుకోవడం కొసమెరుపు. ఇకపోతే ఇతనికి టాలీవుడ్ సీనియర్ నటుడు ఎన్టీఆర్ కి ఒకరకమైన అనుబంధం ఉండేదని కూడా చెబుతారు.

అయితే ఓ విషయంలో పుట్టపర్తి సాయిబాబాకి తనకి వచ్చిన విభేదాల కారణంగా NTR ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మొహం కూడా చూసేవారు కాదట. ఎన్టీఆర్ హీరోగా నటించిన కోడలు దిద్దిన కాపురంలో సత్యనారాయణ వేసిన పాత్ర పుట్టపర్తి సాయిబాబాను పోలి ఉండటమే దానికి ఉదాహరణ. కాగా ఆ పాత్ర కాస్త నెగెటివ్ గా ఉండడంతో వివాదం నెలకొంది. దాంతో సాయిబాబా భక్తులు కోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఏమైందో కానీ సినిమా విడుదల మాత్రం ఆగలేదు. ఆ పాత్ర కూడా సినిమా నుంచి తొలగించలేదు. ఈ కారణంగా వచ్చిన గ్యాప్ వారి ఎడబాటుకి కారణమట.

Share post:

Latest