బుల్లి భల్లాలదేవ వ‌స్తున్నాడు.. ఎట్ట‌కేల‌కు గుట్టు విప్పిన రానా!

టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడని, త్వరలోనే బుల్లి భల్లాలదేవ వ‌స్తున్నాడ‌ని గ‌త‌ కొద్ది రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు. రానా సతీమణి మెహికా రీసెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో కాస్త బొద్దుగా కనిపించింది.

దీంతో ఎలాంటి అధికారిక ప్రకటన రాకముందే మెహికా గ‌ర్భం దాల్చిందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. పైగా మెహికా ఇటీవల ఓ పాపని ఎత్తుకున్న ఫోటోను సైతం పోస్ట్ చేసింది. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. త్వరలోనే రానా ఇంటికి వారసుడు రాబోతున్నాడంటూ ప్ర‌చారం ఊపందుకుంది. ఈ ప్రచారం నిజమే అని నమ్మిన ప్రముఖ గాయని కనికా క‌పూర్‌ రానా దంపతులకు అభినందనలు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఈ విషయంపై ఎట్టకేలకు రానా గుట్టు విప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, మెహికా ప్రెగ్నెంట్ కాదని రానా స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయ‌న పేర్కొన్నారు అంతేకాదు ఒకవేళ త‌న‌కు బిడ్డ పుడితే కచ్చితంగా అందరికీ చెప్తానని రానా తెలిపారు. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడింది.

Share post:

Latest