52ఏళ్ల వయసులో కూడా రమ్య కృష్ణ అందం తరగదేంటబ్బా? ట్రాన్స్‌పరంట్ శారీలో సెగలు పుట్టిస్తోంది!

ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తిగా ఉంటుంది. ప్రముఖ సంచలన చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన నటించి, మెప్పించింది. 1990 నుండి 2000 వరకు దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అని తేడాలేకుండా సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించి, చాలా మంచి పేరు సంపాదించింది.

ఈమె 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో తెలుగు చిత్రరంగంలోకి కథానాయికగా ప్రవేశించింది. మొదట అనేక ఆటుపోట్లు భరించింది. ఓ దశలో ఐరెన్ లెగ్ గా ముద్ర వేసుకుంది. రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. సరిగ్గా అదేసమయంలో అనగా సరిగ్గా 1992లో విడుదలయిన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. అప్పటి నుండి ఆమె కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించి నటిగా ఓ వున్నత శిఖరం మీద ఎక్కి కూర్చుంది.

ఆతరువాతి కాలంలో ఆమె తమిళంలో చేసిన ‘నరసింహ’ సినిమాలోని విలనీ పాత్ర ఆమెకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించిపెట్టింది. మరలా అంత పేరు ఆమెకి చాన్నాళ్ల తరువాత బాహుబలి రూపంలో వచ్చింది. ఆ సినిమాలో శివగామి పాత్రకి జనాలు నీరాజనాలు పలికారు. అసలు విషయానికొస్తే 52 ఏళ్ల వయసులో కూడా రమ్య స్టైలిష్‌గా ఉండటంతో పాటు ఆమె గ్లామర్ చెక్కు చెదరకపోవడం విశేషం. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలనే దానికి నిదర్శనగా చెప్పుకోవచ్చు.

Share post:

Latest