పవన్ కళ్యాణ్ ను లేపేయడానికి కుట్ర జరుగుతోందా..?

సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ జనసేన అధినేత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ మీద దాడులు ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ ముఖ్య అధినేత నాదెండ్ల మనోహర్ ఈ మేరకు అధికారికంగా ఒక లెటర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఆయన లేఖలో తెలిపిన విషయాలు ప్రకారం పవన్ కళ్యాణ్ పైన దాడికి కుట్ర జరుగుతోందని కేంద్రం నుండి మాకు సమాచారం అందుతోందని తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక లెటర్ కూడా వైరల్ గా మారుతోంది.

Supporters of Pawan Kalyan's JanaSena Attack Andhra Min's Car in Vizag,  Actor Barred From Holding Rallies in City till Oct 31
వైజాగ్ లో దీన్ని అమలు చేయాలనుకుంటున్నట్లుగా తెలియజేశారు. లక్ష మంది అభిమానులు హాజరైన నేపథ్యంలో కుదరలేదు.గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇల్లు, కార్యాలయం వద్ద అనుమానితులు సంచరిస్తున్నట్లుగా తెలుస్తోందని తెలియజేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కదలికలు గమనిస్తున్నారని కార్లలో ,ద్విచక్ర వాహనాలపై పవన్ కళ్యాణ్ వాహనాన్ని అనుసరిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోందని నాదేండ్ల మనోహర్ తెలియజేశారు. గడిచిన సోమవారం ముగ్గురు వ్యక్తులు పవన్ ఇంటి వద్దకు వచ్చారని పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడుతూ గొడవకు దిగారని సెక్యూరిటీ వాళ్లను అక్కడినుండి పంపేశారని తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా హత్య ప్రయత్నం చేయాలని.. పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్ లెటర్లో తెలియజేయడం జరిగింది. దీంతో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం జనసేన కార్యకర్తలు కూడా ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా చురుగ్గా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇక కేవలం 18 నెలలు సమయం మాత్రమే ఉంది ఎలక్షన్లకు.

https://twitter.com/JanaSenaParty/status/1587836047136018433?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1587836047136018433%7Ctwgr%5Eeddee8b2ee0a2120853de2bf9e45dacf16f91005%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fstatic.asianetnews.com%2Ftwitter-iframe%2Fshow.html%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FJanaSenaParty%2Fstatus%2F1587836047136018433%3Fref_src%3Dtwsrc5Etfw