ప్రభాస్‌పై ప్రేమను చాటిచెప్పుకున్న ప్రభాస్‌ శ్రీను… అతను రాజైతే నేను మంత్రి!

టాలీవుడ్లో కమిడియన్లకు కొదువేమి లేదు. అలాంటివాళ్లలో ప్రభాస్‌ శ్రీను ఒకడు. తన అసలు పేరు శ్రీను అయినప్పటికీ అందరూ అతనిని ‘ప్రభాస్ శ్రీను’ అని ఎందుకు పిలుస్తారో చెప్పాల్సిన పనిలేదు. అవును, మీరు ఊహించనిది నిజమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శ్రీను మంచి స్నేహితులు అందుకే అతనిని అందరూ ఆ విధంగా పిలుస్తుంటారు. ప్రభాస్ హీరోగా చేసిన ‘డార్లింగ్‌’ అనే సినిమాలో శ్రీను నటించాడు. ఆక్కడినుండి వారి స్నేహం బలపడింది. డార్లింగ్‌ సినిమాలో శ్రీను చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఫైటింగ్‌ సన్నివేశాల్లో చాలా కామెడీ చేశాడు.

దాంతో ప్రభాస్ తనకు ఫోన్‌ చేసి మాట్లాడట. అప్పటి నుంచి వారి ప్రయాణం కొనసాగుతోంది అని తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటర్వ్యూలో శ్రీను చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా శ్రీను అనేక విషయాలు ప్రస్తావించాడు. శ్రీను మొదట సత్యానంద్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్‌ అయినప్పుడు ప్రభాస్‌ కూడా అందులోనే శిక్షణ పొందేవాడట. ఆ బ్యాచ్‌లో కో-ఆర్టిస్టులట. అలా ఏర్పడిన పరిచయం ఇంకా కొనసాగుతోంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శ్రీను ప్రభాస్ కి సహాయకుడిగా ఉంటున్నాడట. ఇప్పటివరకూ శ్రీను 300 సినిమాల్లో నటించాడు.

ఈ నేపథ్యంలో ప్రభాస్ శ్రీను ఆమె ముఖ్యమైన విషయం ప్రస్తావించాడు. ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు శ్రీనుని మంత్రి అని పిలుస్తారట. ప్రభాస్‌తోనే ఎప్పుడు ఉంటాను కాబట్టి ఆయన రాజుగారు, నేను మంత్రిని సరదాగా కృష్ణంరాజు అనేవారట. ఎవరైనా ఫోన్‌చేసి ‘నేను వైజాగ్‌ నుంచి మాట్లాడుతున్నా, తూర్పు గోదావరి నుంచి మాట్లాడుతున్నా’ ఇలా అంటే నాకు నచ్చదు. పేరేంటో చెప్పకుండా ఊరి పేరు చెబితే నాకు కోపం వస్తుంది అని కూడా చెప్పుకొచ్చాడు. కాగా ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రెబల్స్ బాగా ఈ మాటలు ఎంజాయ్ చేస్తున్నారు.

Share post:

Latest