పాపం పూజా హెగ్డే.. ఏదో అనుకుంటే ఇంకేదో జ‌రుగుతుంది?!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డేకి గత కొంతకాలం నుంచి బ్యాడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వరకు వరుస హిట్లతో దూసుకుపోయిన పూజా హెగ్డేకి ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. ఈమె నటించిన రాధాశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు ఈ ఏడాది విడుదలై ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో తెలిసిందే.

ప్రస్తుతం పూజా హెగ్డే ఓ మంచి హిట్ కోసం ఆరాటపడుతుంది. ఇందుకోసం ఆమె టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబునే నమ్ముకుంది. ప్రస్తుతం మహేష్ బాబుకు జోడిగా పూజా `ఎస్ఎస్ఎంబి 28`లో నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై.. ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

దసరా అనంతరం రెండో షెడ్యూల్ ను ప్రారంభించాలని భావించారు. కానీ అంతలోనే మహేష్ తల్లి ఇందిరాదేవి మరియు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కనుమూయడంతో.. ఈ మూవీ షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక‌ ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. అసలే పూజా హెగ్డే ఈ సినిమాతో త్వరగా అపేక్షకుల ముందుకు వచ్చే హిట్టు కొట్టాలని ఆరాటపడుతుంది. కానీ ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. పూజా అనుకున్న‌ది ఏమీ జ‌ర‌గ‌డం లేదు. మ‌రి మ‌హేష్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో.. పూజాకు హిట్ ఎప్ప‌టికి ప‌డుతుందో.. చూడాలి.

 

Share post:

Latest