అక్క‌డ ఉండే స్వేచ్ఛ మ‌రెక్క‌డా ఉండ‌దంటున్న పూజా హెగ్డే!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది వరకు వరుస హిట్లతో యమా జోరు చూపించిన పూజా హెగ్డేకు.. ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదని చెప్పాలి. ఆమె నటించిన `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలు ఈ ఏడాది విడుద‌లై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకున్నాయో తెలిసిందే.

ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబుకి జోడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఎస్ఎస్ఎమ్‌బీ 28` చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో `స‌ర్క‌స్‌`, `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` వంటి ప్రాజెక్ట్స్ లో భాగ‌మైంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ హెగ్డే.. తనకు ఇంట్లో దొరికినంత స్వేచ్ఛ మరెక్కడా దొరకదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ.. `ఇంట్లో ఉన్నంతవరకే మాకు స్వేచ్ఛ. బయటకొస్తే ఇతరుల అంచనాలకు తగినట్లు నడుచుకోవాలి. ఇంటి నుంచి బయట అడుగుపెట్టినది మొదలు అంతటా నటించాల్సి ఉంటుంది. సెలబ్రిటీ లైఫ్‌లో ఇలాంటివి తప్పవు. అయితే ఇంటికి వెళ్లాక మాత్రం నేను నాలా ఉంటాను. అక్కడున్నంత స్వేచ్ఛ నాకు మరెక్కడా దొరకదు. నటిగా నా వృత్తిపర విషయాలన్నీ బయటే వదిలేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్తా` అంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.

Share post:

Latest