కొత్త యాడ్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్.. స్టైలిష్ లుక్ లో వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాతో ఒక్కసారిగా తన ట్రాక్ను మార్చారని చెప్పవచ్చు. అప్పట్నుంచి ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ క్రేజను ఉపయోగించి పలు కంపెనీ సంస్థలు తమ వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. అలా ఇప్పుడు ఒక బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

ఎన్టీఆర్ తన సినిమాలతో వెండితెర పైన అలరిస్తూనే బుల్లితెర పైన హోస్టుగా ఎన్నో షోలకు వ్యవహరించారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ నవరత్న ఆయిల్ ,యాపీ ఫీజ్ వంటి పలు బ్రాండ్స్ కి ప్రచారకర్తగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మరొక బ్రాండ్ కు సంబంధించి పాపులర్ ఫుడ్ డెలివరీ ఆప్ “లిసియాస్ ఫుడ్స్”తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్టీఆర్ ను నియమించుకున్నది. ఎన్టీఆర్ ఇటీవలే ఈ బ్రాండ్ కు సంబంధించి ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్లో కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ ఫోటోలపై పలు రకాల వార్తలు వినిపించాయి. దీంతో ఈ క్రమంలోనే తాజాగా యాడ్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. టెంపర్ సినిమా క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ తరహాలో ఈ యాడ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ బోనులో నిల్చోని ఆ వెంటనే ఇంపాజిబుల్ యువర్ ఆనర్ అంటూ డైలాగ్ చెప్పడం మొదలుపెడతారు. దీంతో డైరెక్టర్ గా కనిపించిన రాహుల్ రవీంద్ర ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆరు పేజీల డైలాగులు చెప్పే మీరు ఇంత చిన్న డైలాగ్ చెప్పలేరా అంటే భయం భయంగా అడుగుతూ ఉంటారు అందుకే ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వద్దు చేప చిన్నది అయినా ఎరా పెద్దది వేయాలి అంటూ.. లిసియస్ ఫుడ్ యాప్ లో దొరికే చేపల గురించి వివరిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇందులో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించారు అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

Share post:

Latest