వైరల్ గా మారుతున్న నిత్యామీనన్.. ప్రభాస్ పై కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్లో మొదట అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిత్యా మీనన్. తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి అనే విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా హీరో ప్రభాస్ ఇష్యూ ఫై ఎంతగానో బాధ పెట్టినట్లుగా తెలియజేసింది నిత్యా మీనన్. అసలు ప్రభాస్ విషయంలో ఏం జరిగింది? ఎందుకు నిత్యామీనన్ అంతలా బాధపడడానికి కారణం వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

When Prabhas Fans Were EXTREMELY UPSET With The Alleged Comments Made By  This Telugu Actress! - Filmibeat

ఈ వీడియోలో నిత్యా మీనన్ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో తెలుగు భాష సరిగ్గా వచ్చేది కాదని తెలియజేసింది. సాధారణంగా తను ఎక్కువగా సినిమాలు చూడనని కన్నడ, మలయాళీ సినిమాలు కూడా తక్కువగా చూసేదాన్ని తెలియజేసింది. నాకు తెలుగు రాదు కనుక టాలీవుడ్ సినిమాలు అసలు చూసేదాన్ని కాదు. అప్పట్లో టాలీవుడ్ లో నాకు తెలిసిన హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మాత్రమే అని తెలియజేసింది. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సందర్భంలో నన్ను మీకు ప్రభాస్ తెలుసా అని ప్రశ్నించారు వాస్తవంగా నాకు ప్రభాస్ పెద్దగా తెలియదు అని సమాధానం ఇచ్చానని తెలియజేసింది.

అప్పుడు తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తను ఏదో పెద్దగా తప్పు చేసినట్లుగా వార్తను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పెద్దగా చేశారని తెలియజేసింది. దీంతో తను చాలా హర్ట్ అయ్యానని తెలిపింది ఆ న్యూస్ తో ఇండస్ట్రీలో నాకు పెద్ద దెబ్బ తగిలిందని అప్పట్లో ప్రభాస్ ఫ్యాన్స్ తనని బాగా ట్రోల్ చేశారని తెలియజేసింది నిత్యా మీనన్. ప్రస్తుతం అందుకు సంబంధించి.. ప్రస్తుతం అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Share post:

Latest