జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నేటిజన్స్.. కారణం..!!

సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ నిజ జీవితంలో కూడా అలాగే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా జీవితం గురించి విషయాలను ఎన్టీఆర్ చెప్పే తీరును బట్టి ఎన్నోసార్లు ఆ మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక అందుకు సంబంధించి వీడియోలు కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ తనకంటే పెద్దవారిపైన ఎంతో గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక సంఘటన ఎన్టీఆర్ గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనగా నిలుస్తోందని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.వాటి గురించి తెలుసుకుందాం.

Puneeth was god's child, great human: Rajinikanth, Jr NTR at Karnataka  Ratna event | The News Minute
పూర్తి వివరాల్లోకి వెళితే నిన్నటి రోజున కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇందులో రజనీకాంత్ తో పాటు ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం ప్రారంభం కంటే ముందు కాస్త వర్షం కురిసింది. దీంతో అతిధుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా తడవడం జరిగింది. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వని కూర్చొని సమయంలో ఎన్టీఆర్ కుర్చీని తుడవడం జరిగింది. మరో కుర్చీలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తిని కూర్చోమని చెప్పి అనంతరం తాను కూర్చునే కూర్చుని క్లీన్ చేస్తున్న ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

Rajinikanth and Jr NTR arrive in Bangalore for late Puneeth Rajkumar's  Karnataka Ratna ceremony- Cinema express

తమ అభిమాన హీరో ఇంత సింప్లిసిటీ గా ఉండడంతో అటు అభిమానులు కూడా ఫిదా అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మహిళలపై ఉన్న గౌరవానికి ఇదే నిదర్శనం అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక రత్న పురస్కారాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest