బ్రేక్ లేకుండానే నయనతార సినిమా.. సక్సెస్ అయ్యేనా..!!

హీరోయిన్గా నయనతార అటు తెలుగు ప్రేక్షకులకు తమిళ ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. చంద్రముఖి సినిమాతో అందరినీ భయపెట్టిన నయనతార ఆ తరువాత ఎన్నో హర్రర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, కోలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానంలో నయనతారనే ఉందని చెప్పవచ్చు. తాజాగా నయనతార కనెక్ట్ అనే ఒక హర్రర్ సినిమాలో నటించింది.

Anupam Kher to star alongside Nayanthara in Tamil movie Connect
ఇక ఈ సినిమా నిడివి 95 నిమిషాలు ఉన్నట్లుగా దర్శకుడు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే ఈ చిత్రం నయనతార మీది ఆధారపడి ఉంది కనుక ఈ సినిమానీ బ్రేక్ లేకుండా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే తమకు కావాల్సిన వాటన్నిటిని తీసుకొని వెళ్లాల్సిందిగా ప్రేక్షకులకు తెలియజేసి థియేటర్లో ఎటువంటి ఇంటర్వెల్ లేకుండా సినిమాని ప్రసారం చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురిచేయాలి అంటే రిలాక్స్ టైం ఇవ్వకూడదని చిత్ర బృందం ఇలా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

Nayanthara-starrer 'Connect' first look unveiled | nowrunning

గంటన్నర వ్యవధి గల ఈ హర్రర్ చిత్రం ఉంటుందని తెలియజేశారు. ఇప్పటికే కనెక్ట్ సినిమా పైన మంచి బజ్ ఏర్పడిందని. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా టెక్నికల్ గా చాలా హైలైట్ అవుతుందని చిత్ర బృందం నమ్మకంతో ఉన్నారు. ఈ విషయాన్ని నయనతార దృష్టికి తీసుకువెళ్లాగా తుది నిర్ణయం దర్శకుడుకే వదిలేసినట్లు సమాచారం. మరి ఎంత మేరకు ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పిస్తుందో చూడాలి.

Share post:

Latest