అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ రోల్స్‌కి సై అంటున్న నాని హీరోయిన్..

జైపూర్ ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ మళ్లీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. తర్వాత నాని, నాగార్జున నటించిన దేవదాసు సినిమాలో యాక్ట్ చేసింది. మళ్లీ మీట్ క్యూట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఒక్క సినిమా తప్ప ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు మరే అవకాశాలు లేవు. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో మీట్ క్యూట్ మూవీ రానుంది. ఈ ఆంథాలజీ సినిమాలో నాని సరసన ఈ భామ యాక్ట్ చేయనుంది. కాగా రీసెంట్ టైమ్స్‌లో ఈ తార గ్లామర్ పాత్రలను చేజిక్కించుకునేందుకు తన అందాలను సోషల్ మీడియా వేదికగా ఆరబోస్తోంది. చూపించి చూపించినట్టుగా మోడ్రన్ డ్రెస్‌ల్లో మెరుస్తూ ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Aakanksha Singh (@aakankshasingh30)

హిందీ బుల్లితెర నుంచి బిగ్ స్క్రీన్‌కి వచ్చిన ఆకాంక్ష సింగ్ హిందీ చిత్రాల్లో కూడా నటించే తనకంటూ ఒక గుర్తింపు దక్కించుకుంది. వైవిద్యభరితమైన పాత్రలో నటిస్తూ అందర్నీ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో పరంపర వెబ్ సిరీస్ కూడా చేసింది. మళ్ళీ రావా సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ భామ ఇప్పుడు అలాంటి సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ముద్దుగుమ్మ తెరమరుగయ్యే అవకాశం ఉంది. ఈ భామ 2014లో రాజస్థాన్‌లో మార్కెటింగ్ ప్రొఫెషనల్ అయిన తన చిరకాల ప్రియుడు కునాల్ సైన్‌ని పెళ్లి చేసుకుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Aakanksha Singh (@aakankshasingh30)

పెళ్లికాకముందు ఈ యాక్ట్రెస్ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత 2017లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ లాగా ఎదగలేకపోయింది. కన్నడ తమిళం సినిమాల్లో కూడా యాక్ట్‌ చేసింది కానీ అక్కడ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.

Share post:

Latest