చిరిగిన జీన్స్‌లో న‌భా సోకుల వ‌ల‌.. ఎంత‌ చూపించినా వేస్టే!?

నభా న‌టేష్‌.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన `వజ్రకాయ` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన న‌భా న‌టేష్‌.. `నన్ను దోచుకుందువటే` అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నభా నటేష్ దశ తిరిగినట్టే అని అందరూ భావించారు.

ఈ క్రమంలోనే ఆమెకు `డిస్కో రాజా`, `సోలో బ్రతికే సో బెటర్`, `మాస్ట్రో` తదితర చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ అమ్మడు నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా ప‌డింది.

దీంతో న‌భా గ్రాఫ్ క్ర‌మంగా డౌన్ అయిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆఫర్లు ఏమీ లేవు. దీంతో న‌భా సోషల్ మీడియా వేదిక అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తరచూ గ్లామ‌ర్ ఫోటో షూట్ల‌తో మతిపోగొడుతోంది. తాజాగా కూడా చిరిగిన జీన్స్ ప్యాంట్‌, బ‌ట‌న్స్ తీసేసిన ష‌ర్ట్ ధ‌రించి.. మేక‌ప్ లేకుండా నాజూకు నడుమును చూపిస్తూ సోకుల వ‌ల విసిరింది.

ప్రస్తుతం నభా తాజా పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నువ్వు ఎంత చూపించినా వేస్టే, ఇక సినిమాల్లో కనిపించవా అంటూ న‌భా ఫోటోల కింద నెటిజ‌న్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ అమ్మడు ఎప్పటికి మళ్ళీ ఫామ్ లోకి వస్తుందో చూడాలి.

Share post:

Latest