అయ్యో ఈమె మీరా జాస్మిన్‌ చెల్లెలా? బ్లాక్‌ టాప్‌లో పిచ్చెక్కిస్తున్న నటి?

మలయాళ బ్యూటీ మీరా జాస్మిన్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట తమిళ డబ్బింగ్ సినిమాలతోనే పరిచయం అయినా, పవన్‌ కళ్యాణ్‌ సరసన ‘గుడుంబా శంకర్’ అనే సినిమాలో హీరోయిన్‌ నటించి తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించింది. ఈ అమ్మడు తాజాగా క్రిస్మస్‌ సెలబ్రేషన్‌లో మునిగి తేలుతోంది. కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న మీరా జాస్మిన్‌ ఇపుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్‌ షోతో రీఎంట్రీకి సిద్ధమైంది. అవును, సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ తోనే ఆమె అందాల ఆరబోతకి తెరలేపింది అని చెప్పుకోవాలి.

తాజాగా మీరా హోమ్లీ లుక్ లో అదరగొట్టింది. బ్లాక్‌ టాప్‌లో ఓ పదేళ్లు వయస్సు కిందికి వెళ్లిపోయేలా చేసింది. అవును, మొదట చూసినపుడు ఈమె మీరా జాస్మిన్‌ చెల్లెలేమో అనుకొనేటట్టు కనిపించనుంది. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఆ విధంగానే స్పందిస్తున్నారు. ఓ హోటల్‌లో క్రిస్మస్‌ సందడి షురూ కాగా, ఇందులో మీరా చిలిపి పోజులతో ఆకట్టుకుంటుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. క్రిస్మస్‌ సెలబ్రేషన్‌కి ఇంకా నెల రోజులముందే పండగ వాతావరణం తెచ్చింది.

గత కొన్నేళ్ల క్రితం మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయిన తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫ్యామిలీ లైఫ్‌లో సెట్ కాలేదేమో అనే అనుమానాలు వున్నాయి. తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు భోగట్టా. దీంతో ఖాళీగా, స్వేచ్ఛగా మారిన మీరా జాస్మిన్‌ మళ్లీ సినిమాల్లో రాణించేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే ఓ మలయాళ చిత్రంలో నటించిన మీరా జాస్మిన్‌ తెలుగుతోపాటు ఇతర సౌత్‌ ఇండస్ట్రీలపై ఫోకస్‌ పెట్టిందట.

Share post:

Latest