ఫ్యాన్స్ కి షాకిచ్చిన మహేష్ బాబు… గుబురు గడ్డంలో మతి పోగొడుతున్నాడు!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బేసిగ్గా మహేష్ ప్రయోగాలు చేయడానికి దూరంగా ఉంటాడు. ఎందుకంటే కెరీర్ బిగినింగ్ నుండి ఆయనకు అవి కలిసి రాలేదు కాబట్టి. ఈ క్రమంలో వచ్చిన టక్కరిదొంగ, నాని, నిజం, ఖలేజా, 1 నేనొక్కడినే, స్పైడర్ వంటి చిత్రాలు అతనికి చేదు అనుభవాలను మిగిల్చాయి. అందుకే అభిమానులు కోరుకున్నట్లు పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేస్తూ వారిని ఉర్రుతలూగిస్తున్నాడు. ఇక మహేష్ తన లుక్ పరంగా కూడా పెద్దగా మార్చరు. మాస్ రోల్స్ లో కూడా గడ్డం, మీసంతో కనిపించిన సందర్భం లేదు.

గతంలో చూసుకుంటే, భరత్ అనే నేను మూవీలో మహేష్ ఒక పాటలో మీసంతో కనిపించారు. అది తప్ప అతను పెద్దగా మార్పులు ఏమి కోరుకోడు. ఇక గడ్డం పెంచడం అంటే ఇంతవరకు మనం మహేష్ ని అలా చూడలేదు. అయితే తాజాగా ఆయన నిండు గడ్డంలో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ లుక్ సరికొత్తగా ఉంది. మాస్ లుక్ లో మహేష్ హాలీవుడ్ యాక్షన్ హీరో కీను రీవ్స్ ని తలపించాడు. లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి నచ్చేయగా వైరల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మూవీ కోసం ఈ లుక్ ట్రై చేస్తున్నారా? అనే సందేహాలు వెలువరిస్తున్నారు.

    అయితే ప్రస్తుతం మహేష్ కృష్ణగారి మరణాంతర కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. కృష్ణ అస్థికలు తాజాగా విజయవాడ కృష్ణానదిలో కలిపారు. ఇంకా దశదిన కర్మ నిర్వహించాల్సి ఉంది. దీంతో త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి మరికొంత సమయం పట్టే సూచనలు లేకపోలేదు. మరోవైపు SSMB 28 స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా థమన్ ని తప్పించారని గుసగుసలు వినబడుతున్నాయి. ఇక మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్న ప్రాజెక్ట్ రాజమౌళి చిత్రం. తన గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో రాజమౌళి మహేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారు.

Share post:

Latest