మంగళగిరిలో లోకేష్ రివర్స్ ..జగన్‌కు కౌంటర్.!

ఓడిన చోటే ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి లోకేష్..మంగళగిరి నియోజకవర్గంలో తెగ కష్టపడుతున్నారు..ఓడిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల్లోనే ఉంటున్నారు…వారికి అండగా ఉంటున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ పనులు చేస్తున్నారు. మొత్తానికి అలా అలా తన బలాన్ని పెంచుకున్నారు.. ఈ సారి గెలుపు దిశగా వెళుతున్నారు. ఈ పరిణామాలని గమనించిన వైసీపీ..మంగళగిరిలో లోకేష్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహం పన్నింది.

అక్కడ బీసీ వర్గంలో బలమైన నేతగా ఉన్న గంజి చిరంజీవులు అని టీడీపీ నుంచి వైసీపీలోకి లాగారు. జగన్ సమక్షంలో గంజి వైసీపీలో చేరారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీసీ కార్డు వాడుతూ..మంగళగిరిలో గంజికి సీటు ఇచ్చి, లోకేష్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇక ఆ స్ట్రాటజీలని అర్ధం చేసుకున్న లోకేష్ సైతం రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రజల్లో తిరుగుతూ, పనిచేస్తూనే, అక్కడ స్థానికంగా బలంగా ఉండే వైసీపీ నేతలని టీడీపీలోకి లాగేస్తున్నారు. ఈ రెండు రోజుల్లోనే చాలామంది కార్యకర్తల్ని టీడీపీలోకి లాగారు.

తాజాగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు గొర్ల వేణుగోపాల్ రెడ్డి టీడీపీలోకి చేరారు. తాడేపల్లి మండలంలో ఈయనకు పట్టు ఉంది. జగనే కాదు, ఆర్కే కూడా వేణుగోపాల్‌ని వాడుకుని వదిలేశారని,   వేణుగోపాలరెడ్డి వంటి బాధితులు ఇంకా చాలమంది వున్నారని, వేణుగోపాలరెడ్డిని, ఆయన అనుచరులను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని లోకేష్ అన్నారు.

ఈయనే కాదు ఇంకా కొంతమంది బలమైన నాయకులని టీడీపీలోకి లాగాలని లోకేష్ చూస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి రూరల్ మండలంలో వైసీపీకి ఇంకా బలం కనిపిస్తోంది. అక్కడ ఆర్కే స్ట్రాంగ్ గా ఉన్నారు. కాబట్టి అక్కడే ఆయన్ని దెబ్బకొట్టడానికి ఇంకా కొంతమంది వైసీపీ నేతలని టీడీపీలోకి లాగాలని లోకేష్ చూస్తున్నారు. వైసీపీ టీడీపీ వాళ్ళని లాగాలని చూస్తే, అంతకంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళని లాగాలని లోకేష్ టార్గెట్ గా పెట్టుకున్నారు.