తన స్నేహితురాలి కోసమే సీరియల్స్ లో నటించిన మెగాస్టార్ హీరోయిన్!

హీరోయిన్ సరిత గుర్తుందా? మరోచరిత్ర సినిమా అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది కదూ. ఆనాడు కమల్ హాసన్ – సరిత కాంబినేషన్లో వచ్చిన మరోచరిత్ర సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో సరిత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా అమె పనిచేసేది. మహానటి సావిత్రి తర్వాత నలుపు రంగు ఉన్న అందమైన హీరోయిన్ సరిత అనే చెప్పుకోవాలి. అప్పట్లో నలుపు రంగు ఉంటే ఇండస్ట్రీలో రాణించడం అసాధ్యం.. అయితే అది కేవలం సరితకు మాత్రమే చెల్లింది.

సరిత హీరోయిన్ గా యావత్ సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సుమారుగా 500 పై చిలుకు చిత్రాలలో నటించింది. ఇక సినిమాల్లో హీరోయిన్ గా కెరియర్ ఓ పట్టాన ముగిసినా కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. అలాగే సరిత తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఇక తన ప్రాణ స్నేహితురాలు అయినటువంటి హీరోయిన్ రాధిక కోసం రాడాన్ మీడియా సంస్థలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది సరిత.

ఇక సరిత వ్యక్తిగత జీవితం కూడా ఒక సినిమా మాదిరిగానే సాగిందని చెప్పుకోవాలి. మొదట ఆమె వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకోగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడంతో అతడికి విడాకులు ఇచ్చి పూర్తిగా సినిమా ప్రపంచంలో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసే ‘నవకాంత్’ అనే వ్యక్తితో ప్రేమలో పడి, ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే అతడు ప్రమాదంలో మరణించడంతో సరిత ఒంటరిగా మిగిలిపోయింది. ఆ బాధ నుంచి కోలుకోవడానికి ముఖేష్ అనే తమిళ్ యాక్టర్ తో మరోసారి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అలాగే వీరికి ఇద్దరు కొడుకులు పుట్టాక వీరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకుంది. కాగా తన కొడుకులతో ప్రస్తుతం దుబాయిలో జీవిస్తోంది.

Share post:

Latest