ప్లాన్ చేంజ్ చేస్తున్న కృతి శెట్టి.. సక్సెస్ అయ్యేనా..!!

టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో యువ హీరోయిన్ల హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అయితే కొంతమంది హీరోయిన్లు ఇక్కడ క్రేజీ సంపాదించకపోయినా పలు అవకాశాలను అందుకుంటూనే ఉంటున్నారు. కేవలం ఒక్క సినిమా సక్సెస్ అయితే చాలు వీరి కెరీర్ మారిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా మొదటిసారి ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ కృతి శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో కృతి శెట్టి నటనతో అందంతో ఇంప్రెస్ చేసి మంచి మార్కులను సంపాదించింది. తన మొదటి చిత్రంతో రూ.100 కోట్ల మార్కును అందుకుంది కృతి శెట్టి.

krithishetty - Twitter Search / Twitterఉప్పెన సినిమా తర్వాత ఇమే చేతులో అరడజను సినిమాలకు పైగా ఉండేవి. అలా శ్యామ్ సింగ్ రాయ్, బంగార్రాజు సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. అటు తర్వాత ఒక్కసారిగా రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది. ఆ తర్వాత వెంటనే వరుసగా ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో వరుస ఫ్లాప్ లతో రిస్క్ లో పడింది ఈ ముద్దుగుమ్మ. దీంతో కొంతమంది వచ్చిన అవకాశానల్లా సైన్ చేసుకుంటూ వెళ్తే ఇలానే ఉంటుంది అంటు కామెంట్స్ చేస్తూ ఉన్నారు నెటిజెన్స్.

Uppena actress Krithi Shetty roped in to play the leading lady in Ram  Pothineni's next with Lingusamy | PINKVILLAఅలా కాస్త సమయం తీసుకుని నాగచైతన్య వెంకట ప్రభు కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మలయాళం లో కూడా ఒక చిత్రంలో నటిస్తోంది. అందుచేతనే కథల ఎంపిక విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా కేవలం తన పాత్ర నచ్చితేనే చేస్తానని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్యత సినిమా ఫ్లాప్ అయ్యిందంటే ఈమె కెరియర్ డ్రాప్ అయినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రెమ్యూనరేషన్,కాస్టింగ్ కన్నా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తుందట కృతి శెట్టి. మరి ఈ ప్లాన్ తోనైనా ఈ ముద్దుగుమ్మ కెరియర్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

Share post:

Latest