అలాంటి చెత్త సీన్‌లలో నటిస్తే కాళ్లు విరగగొడతా.. కృతి తల్లి సీరియస్ వార్నింగ్..?

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన నటనతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పుడు కృతి సనన్‌కి తెలుగు ఇండస్ట్రీలో తన నటనను నిరూపించుకునే అవకాశం వచ్చింది. అదే ఆదిపురుష్ మూవీలో హీరోయిన్ రోల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో ఈ ముద్దుగుమ్మ మెరవనుంది. అయితే అందరికీ హీరోయిన్లలా కాకుండా కృతి తనకిష్టం వచ్చినట్లు నటించలేదట. తన తల్లి తన యాక్టింగ్ విషయంలో చాలా రూల్స్ పెట్టిందట. ముఖ్యంగా కృతి కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించాలంటే తన తల్లి పర్మిషన్ తీసుకోవాలట.

కృతి బెడ్ రూమ్, రొమాన్స్ సీన్స్‌లో నటించడానికి తల్లి అసలు ఒప్పుకోదట. తన తల్లి పెట్టిన కండిషన్స్ వల్ల బాలీవుడ్‌లో ఒక మంచి అవకాశం చేజారిపోయిందని ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పి అందర్నీ నివ్వెరపోయేలా చేసింది. బాలీవుడ్‌లో కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దివాకర్ కలయికతో ‘ది లాస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. అది చాలా పెద్ద హిట్ అయిందనే విషయం అందరికీ తెలుసు. ది లాస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో కియారా అద్వానికీ బాలీవుడ్ లో చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఆ సిరీస్ లో కియారా అద్వానీ బోల్డ్‌గా నటించి బాగా గుర్తింపు తెచ్చుకుంది.

అసలు ఆ కియారా ప్లేస్‌లో కృతి సనన్ నటించాల్సి ఉంది. కరణ్ జోహార్ మొదట కృతి సనన్‌నే సంప్రదించాడట. కానీ కృతి నో చెప్పడంతో అతడు ఎందుకు అని అడిగాడట. అందుకు తన తల్లే కారణమని ఆమె చెప్పిందట. కృతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లి తనని బోల్డ్ వీడియోస్ లో నటించడానికి వీల్లేదని ముందే కండిషన్ పెట్టిందని వెల్లడించింది. తన మాట కాదని చెత్త సీన్‌లలో నటిస్తే కాళ్లు విరగగొడతానని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె చెప్పిందట. అందుకే కృతి సనన్ లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ మిస్ అయింది. ఆ ఛాన్స్ ని కియారా కొట్టేసింది.

Share post:

Latest