విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ కెరియర్ ముగిసినట్టేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా నటించి మెప్పించారు. వెండితెరపై విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న ప్రకాశ్ రాజ్ గత కొంతకాలంగా రాజకీయాలలో ఎక్కువగా చురుకుగా పాల్గొంటూ ఉండడంతోపాటు సోషల్ మీడియాలో కూడా పలు అంశాలపై స్పందిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది నాయకుల పైన కూడా విమర్శిస్తూ ఉంటారు ప్రకాశరాజ్.. 2019లో బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.దీంతో అప్పటి నుంచి రాజకీయాల పైన స్పందిస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్.

Prakash Raj likely to be TRS point-man in proposed frontఇక ప్రకాష్ రాజ్ రాజకీయాల పైన ఎక్కువ దృష్టి పెట్టడంతో తన సినీ కెరియర్ తగ్గిపోతోందని వార్తలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మరొక సారి ఒక ఆంగ్ల మీడియా ఛానల్ తో మాట్లాడిన ప్రకాష్ రాజ్ తన కెరీర్ పై రాజకీయాల ప్రభావం ఎక్కువగా చూపుతోందని తెలియజేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రస్తుతం రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నానని ఇప్పుడు కొందరు తనతో కలిసి పనిచేయడం లేదని.. నాతో కలిసి నటించవద్దని చెప్పడం వల్ల కాదు.. తనతో కలిసి పని చేస్తే వారిని అంగీక రించరేమోనని భయం కొంతమందిలో ఉంది అందుకోసమే పలు అవకాశాలు కోల్పోవలసి వచ్చింది అని తెలియజేశారు ప్రకాష్ రాజ్.

ఎలాంటి పరిణామాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళతాను వాటిని స్వీకరించడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజా పరిణామాలపై తను విచారించడం లేదని కేవలం నటనపైనే దృష్టి పెడుతున్నానని తెలియజేశారు. నేను ఒక మంచి నటుడుగా చనిపోతే చాలని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజు ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest